
మన టాలీవుడ్ లో కొంతమంది బాల నటీనటులు చేసింది ఒక్కటి రెండు సినిమాలే అయినా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తారు, ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ళు చేసిన నటనని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు, అలాంటి చిన్నారుల్లో ఒక్కరు బేబీ వెర్నికా, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయినా బేబీ వెర్నికా తోలి సినిమాతోనే తన క్యూట్ నటనతో ఎంతో ఆకట్టుకుంది, ఈమెని తొలిసారి వెండితెర మీద చూసిన వాళందరూ ఎవరు ఈ పాపా ఇంత క్యూట్ గా ఉంది అని అనుకున్నారు, ఇక ఆ సినిమా తర్వాత వెర్నికా నాన్నకు ప్రేమతో సినిమాలో నటించింది, కేవలం రెండు సినిమాలతోనే బాగా పాపులర్ అయినా ఈ చిన్నారికి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ ఒక్కదాని తర్వాత ఒక్కటి క్యూ కట్టాయి, కానీ అమ్మాయి చదువు పాడు కాకూడదు అని ఆమె తల్లి తండ్రులు సినిమాలు మానిపించేసారు, ఇది ఇలా ఉండగా బేబీ వెర్నికా గురించి ఇటీవల బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.
ఇక వెర్నికా వ్యక్తిగత విషయాలకి వస్తే వెర్నికా తల్లి గారి పేరు జయ, తండ్రి గారి పేరు ప్రసాద్ , వీళ్లిద్దరికీ ఒక్కగానొక్క కూతురు ఈమె, వెర్నికా తల్లి జయ అప్పట్లో వెర్నికా ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసేది, ఆమె వెర్నికా ఫోటో అప్లోడ్ చేసిన ప్రతి సారి వాటికి వేల లైకులు మరియు షేర్లు వచ్చేవి, అలా ప్రతి రోజు వైరల్ అవుతున్న వెర్నికా ఫోటోలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దృష్టిలో పడింది, సరిగ్గా త్రివిక్రమ్ అప్పుడే తానూ తియ్యబోయ్యే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక్క చిన్న పాప రోల్ కోసం ఆడిషన్స్ చేసే ప్రయత్నం లో ఉన్నాడు, అప్పుడు త్రివిక్రమ్ టీం వెర్నికా కి సంబంధించిన ఫోటోలను చూపించారు, వెర్నికా ఫోటోలను చూసి ఎంతో నచ్చినా త్రివిక్రమ్ స్వయంగా ఆయనే వెర్నికా తల్లి తండ్రులకు ఫోన్ చేసి ఒప్పించి ఆ సినిమా లో నటింపచేసారు, అయితే అప్పట్లో ఎంతో క్యూట్ గా వెర్నికా ఇప్పుడు పెద్దది అయ్యి ఓణీల ఫంక్షన్ కూడా జరుపుకుంది, దానికి సంబంధించిన ఫోటోలు మీరు ఇప్పుడు క్రింద చూడవచ్చు.
1
2
3
4
5
6