
నందమూరి తారకరత్న చనిపోయిన ఘటన యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజలను మరియు సినీ సెలెబ్రిటీలను శోకసంద్రం లోకి నెట్టేసింది.నలుగురితో మంచిగా ఉంటూ తనకి తోచిన సహాయం చేస్తూ అందరిని తన సొంత కుటుంబం అనుకునే తారకరత్న అంటే ఇండస్ట్రీ లో ఉన్నవాళ్లందరికీ ఎంతో ఇష్టం.అలాంటి మనషి మనిషికి ఇలా జరగడం నిజంగా దురదృష్టకరమే.తారకరత్న ఆరోజు లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమం లో పాల్గొనకుండా ఉంది ఉంటే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదుకదా?, సంతోషం గా తన పెళ్ళాం పిల్లలతో ఉండేవాడు కదా, అంటూ నందమూరి అభిమానులు ఆరోజు జరిగిన విషయాన్నీ తల్చుకుంటూ బాధపడుతున్నారు.కానీ ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది ఆ పరమాత్మా రాసిన తలరాతని బట్టి ఉంటుంది అనుకోని వదిలేయడమే కానీ, చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొని రాలేము.ఇదంతా జీవితం లో మన అందరం చూడక తప్పదు.
అయితే ఈమధ్య రాజకీయం ఎంతలా దిగజారిపోయిందంటే చావుని కూడా తమకి అనుకూలంగా వాడుకొని ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేసేస్తున్నారు.తారకరత్న మరణం గురించి కూడా ఒక సంచలన ఆరోపణ గత కొంతకాలం నుండి సోషల్ మీడియా ని ఊపేస్తోంది.అదేమిటంటే తారకరత్న కి గుండెపోటు వచ్చిన రోజే చనిపోయాడట.లోకేష్ పాదయాత్ర అర్థాంతరంగా మధ్యలోనే ఎక్కడ ఆగిపోతుందో అనే భయం తోనే చంద్ర బాబు మరియు లోకేష్ ఈ విషయాన్నీ బయటకి తెలియకుండా తారక రత్న శరీరం పాడు అవ్వకుండా స్పెషలిస్ట్స్ తో మ్యానేజ్ చేయించాడని లక్ష్మి పార్వతి సంచలన కామెంట్స్ చేసింది.ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది.డాక్టర్లు కూడా రిపోర్ట్స్ లో గుండె ఆగిపోయిందనే ఇచ్చారని, చంద్రబాబు నాయుడు దుర్మార్గపు రాజకీయాలకు తారకరత్న చావుని కూడా వాడుకున్నాడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్దం ఉందో మనం చెప్పలేము కానీ, లక్ష్మి పార్వతి చేసిన కామెంట్స్ ని పరిశీలించి చూస్తే అది ఎలా సాధ్యం అని ప్రతీ సామాన్యుడికి అర్థం అయిపోతుంది.తారకరత్న ICU లో వెంటిలేటర్ మీద ఉన్న ఫోటోలను మొదటి రోజు నుండి మనం సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాము.ICU లో ఒక మృతదేహాన్ని ఎలాంటి ఫ్రీజర్ లేకుండా భద్రపరిచే ప్రక్రియ ని ఇప్పటి వరకు వైద్య శాస్త్రం లో కనిపెట్టలేదు.అది అసాధ్యం కూడా,అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడం ఎవరి తరం కూడా కాదు, కేవలం ఒకరి మీద అక్కసు తో ఇలా లేని పోనీ ఆరోపణలు చెయ్యడం వంటివి చూస్తుంటే అసలు రాజకీయాల్లోకి వస్తే మానవత్వం అనేదే చనిపోతుందా, లేదా మానవత్వం లేనోళ్లే రాజకీయాల్లోకి వస్తున్నారా అనే సందేహం రాక తప్పదు.