Home Entertainment సంక్రాంతి విన్నర్ గా మెగాస్టార్..దగ్గర్లోకి కూడా రాలేకపోతున్న ‘వీర సింహా రెడ్డి’

సంక్రాంతి విన్నర్ గా మెగాస్టార్..దగ్గర్లోకి కూడా రాలేకపోతున్న ‘వీర సింహా రెడ్డి’

0 second read
0
0
8,370

బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా భావించే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ వంటి ఇద్దరు అగ్ర కథానాయకులు ఈ సంక్రాంతి సీజన్ లో పోటీ పడిన సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎన్నో ఏళ్ళ తర్వాత వీరిద్దరూ ఒకేసారి థియేటర్లలోకి వస్తుండటంతో సాధారణ సినీ ప్రియులతో పాటుగా ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూశాయి. సంక్రాంతి విన్నర్ ఎవరు అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్లను బట్టి ఇద్దరిలో ఎవరు పైచేయి సాధించారో ఇప్పుడు చూద్దాం.

బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య చిత్రం తెరకెక్కగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని వీర సింహారెడ్డి సినిమాకి దర్శకత్వం వహించారు. ఇవి రెండూ కూడా హీరోల అభిమానులు డైరెక్ట్ చేసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు అనే చెప్పాలి. రెండు సినిమాల్లోనూ శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఫైట్స్, డ్యాన్స్, ఆర్ట్.. ఇలా చాలా డిపార్టుమెంట్లలో రెండింటికీ వర్క్ చేసిన టెక్నిషియన్స్ సేమ్ ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై రూపొందడం గమనార్హం. తెలుగు సినీ చరిత్రలో ఒక నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం ఇదే తొలిసారి. అందుకే మొదటి నుంచి కూడా అందరూ ఈ సినిమాల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఒకరోజు ముందుగా థియేటర్లలోకి వచ్చిన వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా మైత్రీ టీం అధికారికంగా ప్రకటించింది. అయితే మొదటి రోజు ప్రభంజనం సృష్టించిన బాలయ్య సినిమా.. టాక్ ఆశించిన విధంగా లేకపోవడంతో సెకండ్ డే కాస్త డీలా పడింది.

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య థియేటర్లలోకి రావడంతో బాలయ్య మూవీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దీంతో 5 రోజుల్లో ఆ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 56 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు భోగి రోజున విడుదలైన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 70 కోట్ల షేర్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొదటి రోజు కలెక్షన్స్ బాలయ్య సినిమా కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. రెండో రోజు నుంచి పుంజుకొని పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ చిరుకి తోడుగా మాస్ మాహారాజా రవితేజ ఉండటం కూడా అదనపు ప్రయోజనంగా మారిందందని అర్ధమవుతోంది. ఓవర్సీస్‌లో వీరసింహారెడ్డి 5 రోజుల్లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేయగా.. వీరయ్య చిత్రం 4 రోజుల్లోనే 1.7 మిలియన్ కు పైగా వసూలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకూ వచ్చిన ఈ రెండు సినిమాల ట్రేడ్ లెక్కల ప్రకారం, బాలకృష్ణపై చిరంజీవి పైచేయి సాధించినట్లుగా తెలుస్తోంది. మరి లాంగ్ రన్‌లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…