Home Entertainment షూటింగ్ బ్రేక్ లో చిరంజీవి ఎన్ని సిగరెట్లు తాగేవాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు

షూటింగ్ బ్రేక్ లో చిరంజీవి ఎన్ని సిగరెట్లు తాగేవాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు

0 second read
0
0
22,401

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఖైదీ కి ముందు , ఖైదీ కి తర్వాత అని చెప్పుకోవచ్చు..అప్పటి వరుకు చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ , ఖైదీ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మరో లెవెల్ కి తీసుకెళ్లి చిరంజీవి కి స్టార్ ఇమేజి ని కట్టబెట్టింది..తొలుత కోదండరామి రెడ్డి గారు ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ తో చేద్దాం అనుకున్నాడు..కానీ ఏడాది 10 ,15 సినిమాలు చేసే అలవాటున్న కృష్ణ గారు ఈ సినిమాకి డేట్స్ సర్దుబాటు చెయ్యలేదు..దీనితో అప్పటికే చిరంజీవి తో న్యాయం కావాలి,అభిలాష మరియు కిరాయి రౌడీలు వంటి సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్న చిరంజీవి తో చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ సినిమా కథ ని ఆయనకీ చెప్పాడు..వెంటనే నచ్చి ఆ సినిమాని చేసి కెరీర్ నే మార్చేసుకున్నాడు మన మెగాస్టార్..వీళ్లిద్దరి కలయిక లో ఆ తర్వాత దాదాపుగా 23 సినిమాలు వచ్చాయి..వీటిలో 90 శాతం సినిమాలన్నీ హిట్టే.

కానీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 9 వ సినిమా రుస్తుం మాత్రం ఫ్లాప్ అయ్యింది..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం పోకిరి మూవీ స్టోరీ తరహాలోనే హీరో ప్రారంభం మొత్తం రౌడీ గా ఉంటూ క్లైమాక్స్ లో పోలీస్ గా దర్శనమిస్తాడు..స్టోరీ పాయింట్ అద్భుతంగా ఉన్నప్పటికీ కథ మరియు కథనం బోరింగ్ గా ఉండడం వల్ల ఈ సినిమా అప్పట్లో ఆడలేదు..అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది..చిరంజీవి గారికి సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది ఈ ఫోటో..షూటింగ్ బ్రేక్ సమయం లో కోదండ రామి రెడ్డి గారితో కలిసి చిరంజీవి సిగరెట్ కాలుస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది..వీళ్లిద్దరి మధ్యలో హీరోయిన్ ఊర్వశి కూడా ఆశ్చర్యపోయి చిరంజీవి వైపు ఎలా చూస్తుందో చూడండి.

ప్రస్తుతం అయితే చిరంజీవి గారు సిగరెట్లు మానేసాడు కానీ..కుర్రతనం లో మాత్రం బాగా తాగేవాడట..ఇక మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య చిత్రం షూటింగ్ శెరవేగంగా సాగుతుంది..చాలా కాలం తర్వాత చిరంజీవి ఎంటర్టైన్మెంట్ తో కూడిన మాస్ మసాలా మూవీ చేస్తుండడం తో అభిమానుల తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఇటీవలే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది..సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అభిమానులను ఎలా అలరించబోతుందో చూడాలి..ఈ చిత్రం లో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు..అన్నయ్య చిత్రం తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా ఇదే..ఇందులో కూడా రవితేజ చిరంజీవి కి తమ్ముడిగా నటిస్తున్నాడు..స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత తన అభిమాన హీరో తో నటిస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందంటూ రవితేజ ఈమధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…