
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహానటుడు స్వర్గీయ శ్రీ SV రంగారావు గారి ఘన చరిత్ర గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది..నటన కి ప్రతిరూపం ఇస్తే అది రంగారావు గారే..అలాంటి మహానటుడు మన తెలుగు పరిశ్రమలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం..ఎంత పెద్ద మహానటుడైనా రంగారావు గారితో కలిసి నటించేటప్పుడు వళ్ళు దగ్గరపెట్టుకొని మరీ నటిస్తారు..ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో డామినేట్ చేస్తాడు కాబట్టి..ఎన్టీఆర్ లాంటి మహానటుడికి కూడా ఒక సన్నివేశం చెయ్యడం కోసం రెండు మూడు టేకులు తింటారు..కానీ SV రంగారావు మాత్రం ఎంత క్లిష్టమైన సన్నివేశాన్ని కూడా సింగల్ టేక్ లోనే పూర్తి చేసేవాడు..అంతటి టాలెంట్ ఉన్నోడు ఆయన..అంతటి మహానుభావుడి లేజసీ ని కొనసాగించడానికి ఆయన కుటుంబం నుండి ఒక్కరు కూడా ఇండస్ట్రీ కి రాకపోవడం ఆశ్చర్యార్ధకం..తల్చుకుంటే ఇండస్ట్రీ కి రావొచ్చు..క్యారక్టర్ ఆర్టిస్టుగానో , లేదా హీరో గానో స్థిరపడొచ్చు..కానీ వాళ్ళు సినీ రంగాన్ని తమకి అనుకూలంగా మార్చుకోడానికి ఆసక్తి చూపలేదు.
అయితే నందమూరి బాలకృష్ణ పుణ్యమా అని రంగారావు గారి మనవళ్లను చూసే అదృష్టం తెలుగు ప్రేక్షకులకు కలిగింది..అసలు విషయానికి వస్తే బాలకృష్ణ ఇటీవల ‘వీర సింహా రెడ్డి’ మూవీ విజయోత్సవ సభ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి..’ఆ రంగారావు..ఈ రంగారావు..అక్కినేని తొక్కినేని’ అంటూ ఆయన మాట్లాడిన మాటలకు రెండు తెలుగు రాష్ట్రాలు భగ్గుమన్నాయి..సోషల్ మీడియా మొత్తం గత మూడు రోజులుగా ఉడికిపోతుంది..ఒక పక్క అక్కినేని ఫ్యాన్స్ బాలయ్య బాబు క్షమాపణలు చెప్పాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు..మరోపక్క కాపునాడు సంఘం మా అభిమాన నటుడిని అవమానిస్తే సహించబోము అంటూ రంగారావు గారికి మద్దతుగా ఒక లేఖని రాస్తూ క్షమాపణలు చెప్పాలి అన్నారు..ఇలా సోషల్ మీడియా లో రగడ జరుగుతున్నా సమయం లో రంగారావు గారి మనవళ్లు మీడియా ముందుకి వచ్చారు..వీళ్ళని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురయ్యారు.
చాలా మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారిలాగా సాదాసీదాగా కనిపిస్తున్న రంగారావు గారి మనవళ్లు మాట్లాడుతూ ‘మొన్న వీర సింహా రెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య బాబు గారు మాట్లాడిన మాటలకు సోషల్ మీడియా లో ట్రోలింగ్ చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు..రంగారావు గారి మనవళ్లు గా బాలయ్య మాటలకూ మేము హార్ట్ అవ్వలేదు..బాలయ్య గారు మా కుటుంబం తో ఎంతో సాన్నిహిత్యం గా ఉంటారు..ఇప్పటికీ కూడా మాతో ఆయన అలాగే ఉన్నారు..మా తాతగారంటే ఆయనకీ ఎంతో భక్తి..దయచేసి ఈ విషయాన్నీ పొడిగించి గలాటా చెయ్యొద్దు’ అంటూ ఈ సందర్భంగా ఒక వీడియో ని విడుదల చేసారు..అది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.