Home Entertainment షాకింగ్.. #RRR సినిమాకి ఆస్కార్ నామినేషన్స్ దక్కకుండా చేసిన వ్యక్తి అతనేనా?

షాకింగ్.. #RRR సినిమాకి ఆస్కార్ నామినేషన్స్ దక్కకుండా చేసిన వ్యక్తి అతనేనా?

5 second read
0
0
278

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..1200 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టి మరోసారి మన టాలీవుడ్ సత్తా ని ప్రపంచం మొత్తానికి చాటేలా చేసింది ఈ చిత్రం..థియేట్రికల్ బిజినెస్ లో సరికొత్త బెంచ్ మార్క్స్ ని సృష్టించిన ఈ సినిమా డిజిటల్ మీడియా లో కూడా అంతకు మించి ప్రభంజనం సృష్టించింది..థియేట్రికల్ పరంగా కేవలం పాన్ ఇండియా వరకే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా..OTT లో విడుదలైన తర్వాత పాన్ వరల్డ్ సినిమా గా మారిపోయింది..ఇతర దేశాలకు  చెందిన వారు ఈ సినిమాని ఎగబడిమరి చూసారు..నెట్ ఫ్లిక్స్ లో ఒక హాలీవుడ్ సినిమా కాకుండా సుమారు గా 20 వారాల నుండి నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతున్న ఏకైక ఇండియన్ సినిమా ఇదొక్కట్టే..బాహుబలి సిరీస్ కి కూడా ఈ రేంజ్ రీచ్ రాలేదు..#RRR కి ఈ స్థాయి రీచ్ వస్తుందని బహుశా #RRR టీం కూడా ఊహించి ఉండదు.

ఇక ఈ సినిమాలో హీరోలు గా నటించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి కూడా ఏ ఇండియన్ హీరో కి కూడా దక్కని రేంజ్ రీచ్ దక్కింది..సోషల్ మీడియా తెరిస్తే చాలు..ఇతర దేశాలకు చెందిన వారు ఈ ఇద్దరి హీరోల గురించి పొగుడుతూ వేసిన ట్వీట్స్ మాత్రమే కనిపించేవి..హాలీవుడ్ కి చెందిన ప్రముఖ వార పత్రిక ‘వెరైటీ’ అయితే హాలీవుడ్ టెక్నిషన్స్ తో పాటుగా #RRR మూవీ నుండి రాజమౌళి తో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు కూడా ఆస్కార్ అవార్డ్స్ వస్తుందని అంచనా వేసి ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు..జాతీయ స్థాయి మీడియా లో ఇది మారుమోగిపోయింది..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని నుండి ఆస్కార్ కి నామినేట్ అవుతున్న ఏకైక హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మాత్రమే అంటూ తెగ ప్రచారం సాగింది..ఇక ఈ ఇద్దరి హీరోల అభిమానులు అయితే గత నెల రోజుల నుండి ‘మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప’ అంటూ సోషల్ మీడియా లో తగువులు పెట్టుకుంటూనే ఉన్నారు.

కానీ మన ఇండియన్ గవర్నమెంట్ #RRR ని పక్కన పెట్టి గుజరాతి సినిమా అయినా ‘లాస్ట్ ఫిలిం షో’ అనే సినిమాని ఉత్తమ చిత్రం క్యాటగిరి లో నామినేషన్స్ కి పంపించారు..దీని పై సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది..బీజేపీ ప్రభుత్వం త్వరలో గుజరాత్ లో జరగబొయ్యే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియని గుజరాతి సినిమాని నామినేషన్స్ కి పంపారని..ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అంటూ టాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖులు విమర్శిస్తున్నారు..మరో పక్క #RRR మూవీ టీం కూడా ఆస్కార్ నామినేషన్స్ కోసం ఎలాంటి కృషి చెయ్యలేదు..ఒక ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా అరుదు..అలాంటి అదృష్టం అందరికి రాదు..కానీ #RRR కి వచ్చింది..చేతికొచ్చిన అద్భుతమైన అవకాశం ని నిర్లక్ష్యం చేసి ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఒక గొప్ప సినిమాని లేకుండా చేసారంటూ సోషల్ మీడియా లో విమర్శల వెల్లువ కురుస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై…