
ఇటీవల కాలం లో భారీ బడ్జెట్ సినిమాలకంటే తక్కువ బడ్జెట్ సినిమాలే ఎక్కువ లాభలను నిర్మాతలకు తెచ్చి పెడుతుంది..ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అతి తక్కువ బడ్జెట్ తో విడుదలైన DJ టిల్లు చిత్రం ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కేవలం 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..ఇక కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా తెలుగు వెర్షన్ కూడా కేవలం 6 కోట్ల రూపాయిల బిజినెస్ ని మాత్రమే జరుపుకుంది..కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..ఈ సినిమా యొక్క ప్రభావం అప్పుడే కొత్తగా విడుదలైన తెలుగు సినిమాల మీద కూడా పడింది అంటే ఏ మాత్రం అతిశయం కాదు..అయితే ఈ రెండు సినిమాల రేంజ్ లో కాకపోయినా..జరిగిన బిజినెస్ కి అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకి దూసుకుపోతున్న చిత్రం హ్యాపీ బర్త్డే.
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది..మత్తు వదలరా వంటి సూపర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన రితేష్ రానా దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా కావడం, దానికి తోడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుండి విడుదలైన సినిమా కావడం ఈ మూవీ కి ప్లస్ పాయింట్స్..200 కి పైగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్ ని దక్కించుకుంది..మైత్రి మూవీ మేకర్స్ వారికి సొంతంగా థియేటర్స్ ఉండడం తో ఈ మూవీ ని సొంతగానే విడుదల చేసుకున్నారు..కానీ థియేట్రికల్ వేల్యూ ప్రకారం ఈ సినిమా కి దాదాపుగా ఒక కోటి 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది..అయితే తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురుస్తున్నప్పటికీ కూడా 30 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి పర్వాలేదు అనిపించింది..ఇక రెండవ రోజు కూడా అదే రేంజ్ వసూళ్లను రాబట్టి స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది..ఇక మూడవ రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్ వసూళ్లను రాబట్టి తొలి మూడు రోజుల్లోనే కోటి రూపాయిల షేర్ ని సాధించి 80 శాతం కి పైగా రికవరీ సాధించింది..ఇక ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే వీక్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ పండితుల అభిప్రాయం..అదే కనుక జరిగితే ఈ సినిమా తొలి వారం లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ కి చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు..చూడాలి మరి ఈ సినిమా స్టేటస్ ఎక్కడకి వెళ్లి ఆగుతుంది అనేది.