Home Entertainment షాకింగ్..హీరో వేణు తొట్టెంపూడి ఇప్పుడు ఎలా మారిపొయ్యాడో చూస్తే మెంటలెక్కిపోతారు

షాకింగ్..హీరో వేణు తొట్టెంపూడి ఇప్పుడు ఎలా మారిపొయ్యాడో చూస్తే మెంటలెక్కిపోతారు

0 second read
0
2
18,170

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తమకంటూ ఒక్క ప్రత్యేకమైన ఇమేజి ని స్టార్ షూస్ ని సొంతం చేసుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు..అలాంటి హీరోలలో ఒక్కడే వేణు తొట్టెంపూడి..స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా వేణు అతి తక్కువ సమయం లోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక్క ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు..ఆయన నటించిన సినిమాలలో ఎక్కువ శాతం విజయం సాధించిన సినిమాలే అవ్వడం విశేషం..తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల వేణు, అదే సమయం లో సెంటిమెంటల్ సీన్స్ తో కూడా కన్నీళ్లు పెట్టించగలడు..అవకాశాలు వరుసగా వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకుండా..జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే వేణు కెరీర్ లో అధిక శాతం విజయం సాధించిన సినిమాలే ఉన్నాయి..ఒక్కసారి ఆయన చేసిన సినిమాలు పరిశీలిస్తే..ఇప్పటి వరుకు ఆయన 23 సినిమాల్లో నటిస్తే వాటిల్లో స్వయంవరం, చిరు నవ్వుతో, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, పెళ్ళాం తో పనేంటి,చెప్పవే చిరుగాలి,శ్రీ కృష్ణ 2006 , యమ గోల మళ్ళీ మొదలైంది, గోపి గోపిక గోదావరి వంటి ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇండస్ట్రీ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్నప్పటికీ కూడా కెరీర్ మీద ఆసక్తి పోవడం తో సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి వ్యాపారం మొదలు పెట్టాడు..2001 వ సంవత్సరం లో అనుపమ చౌదరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న వేణు కి ఒక్క కొడుకు ఒక్క కూతురు ఉన్నారు..వ్యాపార రంగం లో గొప్పగా రాణించిన వేణు తొట్టెంపూడి 2018 వ సంవత్సరం లో తన బావ నామ నాగేశ్వర రావు కోసం TRS పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం కూడా చేసాడు..తనకు రాజకీయాల పైన ఎలాంటి ఆసక్తి లేదని..కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో గమనిస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు వేణు..తన బావ నామా నాగేశ్వర రావు సేవ కార్యక్రమాలు ఎలా చేస్తాడో తెలిసే ఈరోజు ఆయన కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నాని చెప్పుకొచ్చాడు వేణు..2018 వ సంవత్సరం లో మీడియా ముందుకి చివరిసారిగా కనిపించిన వేణు ఆ తర్వాత మళ్ళీ మీడియా  ముందు కనిపించలేదు.

అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నాడు వేణు తొట్టెంపూడి..మాస్ మహా రాజా రవితేజ హీరో గా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో వేణు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు..ఇందులో ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్ ఉండేట్టు ప్లాన్ చేసాడట ఆ చిత్ర దర్శకుడు వంశి..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ గా గడుపుతున్నాడు వేణు..ఈ సినిమా ద్వారా కేవలం ఒక్క వేణు మాత్రమే కాదు..పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది..స్టువర్ట్ పురం బందిపోటు టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు వంశి..ఇది ఇలా ఉండగా వేణు చివరి సారిగా వెండితెర మీద కనిపించిన సినిమా 2013 వ సంవత్సరం లో విడుదలైన రామాచారి.అంతకు ముందు ఆయన ఎన్టీఆర్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన దమ్ము సినిమాలో నటించాడు..సుమారు పదేళ్ల విరామం తర్వాత వేణు మళ్ళీ ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా ద్వారా అతి త్వరలోనే మన ముందుకి రాబోతున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…