
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనదైన శైలిలో రాణిస్తున్నాడు. నాగార్జున వారసుడిగా అక్కినేని అభిమానులను అలరిస్తూ ఆ లెగసీని కొనసాగిస్తున్నాడు. ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను అలరిస్తూ సరికొత్త చిత్రాలతో, వైవిధ్యమైన కథలతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ ఎంట్రీ ఇచ్చిన గాని తమ్ముడితో పోలిస్తే అన్న నాగచైతన్యకే ఎక్కువ హిట్స్ ఉన్నాయి. అఖిల్ మాదిరిగా చైతూకి తొలి సినిమా ఫ్లాప్ అయినా చైతూ రొమాంటిక్ కథలతో ఏ మాయ చేశావె, 100 పర్సెంట్ లవ్, ఒక లైలా కోసం, ప్రేమమ్ వంటి హిట్స్ అందుకున్నాడు. కానీ అఖిల్ మాత్రం తనకు సరిపోయే కథలను ఎంచుకోవడంలో విఫలం అవుతున్నాడు. అయితే నాగచైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు కూడా ఉన్న సంగతి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటి నాగార్జున, అమల దంపతులకు అఖిల్ ఒక్కడే కదా అని ఆశ్చర్యపోకండి. తండ్రి పరంగా చూసుకుంటే నాగచైతన్యకు తమ్ముడు అఖిల్ ఉన్నాడు. అదే తల్లి పరంగా చూసుకుంటే మరో తమ్ముడు కూడా ఉన్నాడు.
అక్కినేని నాగార్జునకు అమల రెండో భార్య అన్న సంగతి చాలా మందికి తెలిసిందే. నాగార్జున తొలి భార్య హీరో విక్టరీ వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మీ. లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నప్పుడు నాగచైతన్య జన్మించాడు. అయితే తర్వాత కొద్ది రోజులకు నాగార్జున లక్ష్మీకి విడాకులు ఇచ్చి హీరోయిన్గా రాణిస్తున్న అమలను వివాహం చేసుకున్నాడు. అటు భర్త నుంచి విడిపోయిన తర్వాత లక్ష్మీ కూడా శరత్ విజయ్ రాఘవన్ అనే చెన్నైలోని పారిశ్రామికవేత్తను వివాహం చేసుకుంది. అయితే విజయ్ రాఘవన్‌కు కూడా ఇది రెండో వివాహం కావడం గమనించాల్సిన విషయం. లక్ష్మీని పెళ్లి చేసుకునే సమయానికే అతడికి ఓ కుమారుడు ఉన్నాడు. గత ఏడాది అతడి వివాహం జరిగింది. ఈ వివాహానికి చైతూ, సమంత కలిసి హాజరయ్యారు. అప్పట్లో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు నాగచైతన్య రెండో కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అతడి లుక్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న అతడు త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.
కాగా నాగచైతన్య బాల్యంలోనే తన తల్లి లక్ష్మీ రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె దగ్గరే పెరిగాడు. అలా కొన్ని సంవత్సరాలు చైతూ చెన్నైలోనే పెరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి నాగార్జునతో కలిసి ఉన్నాడు. చైతూ తన తల్లిని చూడడానికి తరుచు చెన్నైకి వెళ్తుండేవాడు. అయితే బాల్యం నుంచే చైతూకు సినిమాలు అంటే ఇష్టం ఉండటంతో జోష్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల థాంక్యూ సినిమాతో చైతూ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇంతలోనే చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లాల్ సింగ్ చద్దా కూడా విడుదలైంది. ఈ మూవీలో బాలరాజు పాత్రలో చైతూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అమీర్ ఖాన్ లాంటి గొప్ప నటుడితో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని చైతూ వివరించాడు. భవిష్యత్‌లో అవకాశం వస్తే ఇలాంటి పాత్రలు మరిన్ని చేస్తానని చైతూ అంటున్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో చాలా ఆనందంగా ఉన్నట్లు చైతూ తెలిపాడు.