
మన టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో సూపర్ స్టార్ ధం ని ఎంజాయ్ చేస్తున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..ఈయన నటించిన చివరి మూడు సినిమాలు అయినా భరత్ అనే నేను , మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలిచాయి..వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో కొట్టుమిట్టాడుతున్న మహేష్ కి ఈ సినిమాలు మళ్ళీ ఊపిరి పోశాయి అనే చెప్పాలి..ఈ సినిమాల తర్వాత భారీ గాప్ తీసుకొని ఆయన చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట, మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఒక్క పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమా చెయ్యడం, దానికి తోడు గీత గోవిందం వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో బాక్స్ ఆఫీస్ ని ఒక్క ఊపు ఊపేసిన ప్రముఖ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నుండి విడుదల అయినా పాటలు మరియు ట్రైలర్ అద్భుతం గా అనిపించాయి..ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి మన ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే డైరెక్టర్ పరశురామ్ పెట్ల గీత గోవిందం సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక్క సినిమా చెయ్యాల్సి ఉంది..ఆ సినిమా మరేదో కాదు సర్కారు వారి పాట సినిమానే..స్టోరీ లైన్ కూడా అల్లు అర్జున్ కి చెప్పగా వెంటనే ఓకే చెప్పాడు..ఇక మహేష్ బాబు ఆ సమయం లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక్క సినిమా చెయ్యాల్సి ఉంది..ఆ సినిమా మరేదో కాదు,అది పుష్ప సినిమానే..కథ చర్చలు మొత్తం పూర్తి అయ్యాయి రేపో మాపో షూటింగ్ ప్రారంభం అనుకుంటున్నా సమయం లో , మహేష్ బాబు స్క్రిప్ట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేయాల్సిందిగా కోరాడట..కానీ అందుకు సుకుమార్ ఒప్పుకోలేదు..దానితో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఆ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ సినిమా కార్య రూపం దాల్చలేకపోయింది..మహేష్ బాబు తో సినిమా క్యాన్సిల్ అవ్వగానే వెంటనే అదే స్టోరీ ని అల్లు అర్జున్ చెప్పాడట సుకుమార్..ఆయనకీ విపరీతంగా నచ్చడం తో పరశురామ్ తో ఓకే చేసిన స్క్రిప్ట్ ని పక్కనపెట్టి , డేట్స్ మొత్తం సుకుమార్ కి కేటాయించి పుష్ప సినిమా చేసాడు..ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.