
భీమ్లా నాయక్ వంటి సంచలన విజయం సాధించిన తర్వాత దగ్గుపాటి రానా హీరో గా నటంచిన విరాట పర్వం చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఎప్పుడో ఏప్రిల్ 17 వ తేదీ 2021 వ సంవత్సరం లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు నిన్న విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఆఫ్ బీట్ సినిమా కావడం తో ఈ మూవీ పై అటు దగ్గుపాటి అభిమానుల్లో కానీ..ఇటు ప్రేక్షకుల్లో కానీ ఎలాంటి అంచనాలు లేవు..కానీ ట్రైలర్ కాస్త ఆసక్తికరంగా ఉండడం తో ఓపెనింగ్స్ దుమ్ము లేపే రేంజ్ లో వచ్చాయని చెప్పలేము కానీ పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్ ని దక్కించుకుందని చెప్పొచ్చు..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతకు జరిగింది..మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టింది..? ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందా లేదా అనే అంశాల గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 11 కోట్ల రూపాయిల వరుకు జరిగింది..ఎప్పుడో షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి OTT ఆఫర్స్ చాలానే వచ్చాయి..కానీ ఆ చిత్ర నిర్మాత ఈ సినిమాని థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని సంకల్పించి పరిస్థితులు అన్ని చెక్కబడిన తర్వాత ఇప్పుడు విడుదల చేసాడు..మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తొలిరోజు 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం..దీనితో మొదటి రోజే 25 శాతం రికవరీ ని ఈ సినిమా సాధించినట్టు తెలుస్తుంది..ఇక వీకెండ్ అవ్వడం తో రెండవ రోజు అలాగే మూడవ రోజు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి మూడు రోజులకు గాను 5 నుండి ఆరు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలిమరి.
ఇది ఇలా ఉండగా లాక్ డౌన్ సమయం లో ఈ సినిమాకి 15 కోట్ల రూపాయిల OTT డీల్ వచ్చింది..నిర్మాత సురేష్ బాబు ఈ డీల్ ని కాదని తెలివైన పని చేసాడనే చెప్పాలి..ఎందుకంటే థియేట్రికల్ బిజినెస్ ద్వారానే 11 కోట్ల రూపాయిలు రాబట్టిన సురేష్ బాబు..వేరే OTT ఛానల్ కి సుమారు 15 కోట్ల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమ్మాడు..అంతే కాకుండా ఈ సినిమా హిందీ దుబ్బింగ్ రైట్స్ దాదాపుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది..బాహుబలి సిరీస్ ద్వారా రానా కి హిందీ లో మంచి పాపులారిటీ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..అందువల్లే ఈ సినిమాకి హిందీ రైట్స్ మంచిగా వచ్చాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..మొత్తానికి 15 కోట్ల రూపాయిల OTT డీల్ తో ముగియాల్సిన ఈ సినిమా కి అదనంగా 15 కోట్ల రూపాయిల లాభం సురేష్ బాబు సమయస్ఫూర్తి వల్ల వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.