
బాలనటిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టి ఆలిండియా స్టార్‌గా ఎదిగిన హీరోయిన్‌లలో శ్రీదేవి ఒకరు. తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో ఆమె నటించి అందరినీ మెప్పించింది. తెలుగు సినీ పరిశ్రమలో అప్పట్లో ఎంత మంది హీరోయిన్‌లు ఉన్నా శ్రీదేవికి వచ్చిన క్రేజ్ ఎవరికీ రాలేదు. అప్పటికే జయసుధ, జయప్రద, రాధ వంటి హీరోయిన్‌లు రాజ్యమేలుతున్నా.. శ్రీదేవి తన అందం, అభినయంతో రాణించింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు మించి రెమ్యునరేషన్ తీసుకున్న ఘనత శ్రీదేవికే దక్కింది. దాదాపుగా అగ్రహీరోలందరి సరసన శ్రీదేవి నటించింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో శ్రీదేవి కొన్ని తప్పటడుగులు వేసింది. సినిమా కెరీర్‌ను బంగారు మయంలా మార్చుకుని నిజ జీవితాన్ని మాత్రం శ్రీదేవి చేతులారా చీకట్లోకి నెట్టుకుంది.
ఎంతో అందం ఉన్న శ్రీదేవిని ఎందరో అభిమానులు గుండెల్లో పెట్టుకుని ఆరాధించేవారు. అయితే తన కంటే వయసులో పెద్దవాడైన వాడిని శ్రీదేవి ప్రేమించి పెళ్లి చేసుకుని తప్పటడుగు వేసింది. అది కూడా అప్పటికే వివాహం చేసుకుని పిల్లలు ఉన్న వ్యక్తిని ప్రేమించి చేయరాని తప్పు చేసింది. అంతేకాకుండా పెళ్లి కాకుండానే బోనీకపూర్ బిడ్డకు తల్లి అయ్యింది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పిల్లలను కనడం తప్పు. హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాతే పిల్లలను కనడం అనేది తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. కానీ శ్రీదేవి మాత్రం పెళ్లయిన మగాడితో ఇలా బిడ్డను కనడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. చివరకు బోనీకపూర్ వల్ల ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుందనే టాక్ ఉంది. దేశం కాని దేశంలో అందాల యువరాణిగా పేరు పొందిన శ్రీదేవి విగతజీవిగా మారి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. బోనీకపూర్ కుటుంబంతో విభేదాలే ఆమె మరణానికి కారణాలుగా ఇప్పటికీ చాలా మంది భావిస్తుంటారు.
కట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ తొలి భార్య రేణుదేశాయ్ కూడా శ్రీదేవి బాటలోనే నడిచింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్‌గా పరిశ్రమకు పరిచయమైంది. అయితే రేణుదేశాయ్ కూడా శ్రీదేవి తరహాలో పెళ్లయిన మగాడినే పెళ్లి చేసుకుంది. అప్పటికే మెగా బ్రదర్‌గా ఫామ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్‌కు నందిని అనే అమ్మాయితో వివాహం జరిగి విడాకులు కూడా అయిపోయాయి. రేణుదేశాయ్ కూడా పెళ్లి కాకుండానే పవన్‌తో డేటింగ్ చేసి ఓ బిడ్డ కడుపులో పడ్డాక పెళ్లి చేసుకుంది. పవన్ కళ్యాణ్-రేణుదేశాయ్ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీళ్లు విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలు అవుతోంది. అనంతరం పవన్ మూడో పెళ్లి కూడా చేసుకున్నా రేణుదేశాయ్ మాత్రం తన ఇద్దరు పిల్లలను పెంచుతూ వాళ్లతో టైమ్ స్పెండ్ చేస్తోంది. అలా రేణు దేశాయ్ తనకు తెలియకుండానే శ్రీదేవి బాటలో నడిచింది. పెళ్లయిన మగాళ్లనే వివాహం చేసుకుని వీళ్లిద్దరూ పెళ్లికి ముందే గర్భం దాల్చారు. కానీ రేణుదేశాయ్ జీవితం శ్రీదేవిలా కాకూడదని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.