
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ సంచలనం థమన్..మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన కిక్ సినిమాతో ప్రారంభమైన థమన్ సంగీత ప్రస్థానం ఈరోజు ఏ స్థాయిలో ఉందొ ప్రతేకంగా చెప్పనక్కర్లేదు..సౌత్ లో ఇప్పుడు ఏ హీరో సినిమాకైనా థమన్ కావాల్సిందే..ఇటీవల కాలం లో ఆయన మ్యూజిక్ ఇచ్చిన ప్రతి సినిమా హకెర్ట్ బస్టర్ గా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా కూడా నిలిచాయి..థమన్ కోసం దర్శక నిర్మాతలు మరియు హీరోలు ఇంతలా ఎందుకు వెంటపడుతారటంటే ఆయన ఇచ్చే పాటలతో పాటు..ఆయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది..కేవలం ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా సూపర్ హిట్ గా నిలిచినా సినిమాలు ఎన్నో ఉన్నాయి..అందుకు ఉదాహరణగా ఈ ఏడాది విడుదలై భారీ హిట్ గా నిలిచినా భీమ్లా నాయక్ సినిమాని తీసుకోవచ్చు..కంటెంట్ పరంగా ఈ సినిమా అంత గొప్పదేమీ కాదు..కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల థమన్ అందించిన సంగీతం వల్లే ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్ళింది.
అలా ఇటీవల కాలం లో ఎన్నో సినిమాలు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సూపర్ హిట్ అయినవి ఉన్నాయి..ప్రస్తుతం ఆయన రేంజ్ ఆ లెవెల్ లో నడుస్తుంది..కంటెంట్ లేని సన్నివేశం ని కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో లేపడం థమన్ లో ఉన్న స్పెషలిటీ..అఖండ సినిమాకి అయితే కొన్ని థియేటర్స్ లో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పవర్ తట్టుకోలేక DTS బాక్స్ లు మరియు స్క్రీన్ లు కాలిపోవడం వంటివి చూసి అందరూ షాక్ కి గురైయ్యారు..ప్రస్తుతం ఆయన చేతిలో 12 సినిమాలు ఉన్నాయి..అందులో రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఒకటి ఉంది..శంకర్ లాంటి దర్శకుడు కూడా AR రెహ్మాన్ ని కాదని థమన్ వెంట పడ్డాడంటే ఆయన రేంజ్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలన్నీ రికార్డింగ్ పూర్తి చేసేసాడట థమన్.
థమన్ శంకర్ కి పెద్ద వీరాభిమాని..శంకర్ తెరకెక్కించిన బాయ్స్ అనే సినిమాలో థమన్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు..ఇప్పుడు అదే శంకర్ సినిమాకి ఆయన సంగీతం అందిస్తుండడం నిజంగా ఆయన సాధించిన గొప్ప విజయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు..రాక రాక వచ్చిన ఈ అద్భుతమైన అవకాశం ని థమన్ ఎలా ఉపయోగించుకుంటాడో ఒకసారి ఊహించుకోవచ్చు..ఇది ఇది ఉండగా థమన్ తన ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా అభిమానులతో తరుచు ఇంటరాక్ట్ అవుతూ ఉండే విషయం మన అందరికి తెలిసిందే..తన కొత్త సినిమాల సంగీతం గురించి అలాగే తనకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వేదిక ద్వారా పంచుకంటూ ఉంటారు..ఇప్పటి వరుకు ఆయన ఎన్నడూ కూడా తన భార్య పిల్లల్ని చూపించలేదు..అయితే తొలిసారిగా తన కుటుంబానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా లో షేర్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇందులో థమన్ కొడుకు అజిత్ కూడా ఉన్నాడు..బొద్దుగా ఆచం తండ్రి పోలికలతో పుట్టిన అజిత్ ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు..ఆయనకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
1
2