
టాలీవుడ్లో ఎంతోమంది స్టార్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలో హీరో మహేష్‌బాబు కూడా ఉన్నాడు. వంశీ సినిమా సమయంలో ఆ మూవీలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్‌తో ప్రేమలో పడ్డాడు. ఆ సినిమా తర్వాత 2005లో నమ్రతను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని తన కుటుంబంలోకి తీసుకువెళ్లాడు. మహేష్ పెళ్లి చేసుకుని 17 ఏళ్లు దాటిపోయింది. పెళ్లి అనంతరం నమ్రత ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. అయితే అప్పటికే ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి అంజి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నమ్రత పెళ్లి తర్వాత విడుదలైంది. ఈ మూవీకి కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు. మహేష్ లైఫ్‌లోకి నమ్రత ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడి జీవితమే మారిపోయింది. మహేష్ బాబు డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ కంప్లీట్‌గా మారిపోయాయి. అప్పటివరకు అమూల్ బేబీలా ఉన్నవాడు మ్యాన్లీగా తయారయ్యాడు. దీంతో బోలెడన్ని కమర్షియల్ యాడ్స్ మహేష్‌ను వెతుక్కుంటూ వచ్చాయి.
మహేష్ సినిమాలకు సంబంధించిన యాడ్స్, బిజినెస్, ప్రమోషన్లు వంటి వ్యవహారాలన్నీ నమ్రతనే చక్కపెడుతుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నమ్రత ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పెళ్లికి ముందే తన సినిమాల షూటింగులు పూర్తి చేయడానికి మహేష్ బాబు కోసం తాను రెండేళ్లకు పైగా ఎదురు చూశానని నమ్రత స్పష్టం చేసింది. మహేష్‌తో పెళ్లికి ముందు తాను ఓ కండిషన్ పెట్టానని… తాను ముంబైలో పెరిగినందున పెద్ద ఇంట్లో నివసించటం సౌకర్యంగా ఉండదని చెప్పడంతో మహేష్ తన కోసమే అపార్టుమెంట్లోకి మారాడని కూడా నమ్రత చెప్పుకొచ్చింది. తాను నటన నుంచి తప్పుకున్నందుకు ఎలాంటి బాధ లేదని.. తన తల్లి కోరిక మేరకే తాను మోడలింగ్ ప్రారంభించామని చెప్పింది. పెళ్లి అయ్యి 17 ఏళ్లలో తనకు సినిమా ఆఫర్లు చాలా వచ్చాయని.. కానీ దేనికీ ఓకే చెప్పలేదని నమ్రత తెలిపింది. భవిష్యత్తులో కూడా ఏ సినిమాలోనూ నటించే అవకాశం లేదని చెప్పింది.
మరోవైపు మహేష్ నటన అంటే తనకు ఎంతో ఇష్టమని నమ్రత తెలిపింది. అతడు నటించిన సినిమాల్లో పోకిరి అంటే చాలా ఇష్టమని.. అయితే తామిద్దరం కలిసి నటించిన వంశీ సినిమా అంటే ఇష్టం లేదని వివరించింది. ఫ్యామిలీ విషయంలో నమ్రతత చాలా కేర్ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో మహేష్ కొత్త ఫోటోలను, గౌతమ్, సితారలకు సంబంధించిన కొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గౌతమ్ ఇప్పటికే మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. రాబోయే రోజుల్లో అతడు కూడా హీరోగా రాణించాలని సూపర్ స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ సినిమా షూటింగులతొ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలను, పిల్లలకు సంబంధించిన బాధ్యతలను నమ్రత చూసుకుంటోంది. ఈ విషయంలో మహేష్ చాలా లక్కీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వస్తున్నాయి. సినిమా, సినిమాకు ఎక్కువగా గ్యాప్ తీసుకునే మహేష్ వెకేషన్‌కు విదేశాలకు వెళ్తుంటాడు. అక్కడ తన పిల్లలు ఎంత స్వేచ్ఛగా ఉండాలని భావిస్తే అంత స్వేచ్ఛగా ఉంటారు.