Home Entertainment షాకింగ్..పూజ హెగ్డే ఆస్తుల వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు

షాకింగ్..పూజ హెగ్డే ఆస్తుల వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు

0 second read
0
0
583

టాలీవుడ్ టాప్ హీరోలతో నటిస్తూ యూత్ ని అక్కటుకున్న నటి పూజ హెగ్డే తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీ లో నటిస్తూ బిజీ గా ఉన్నారు, ఆమె డేట్స్ ఇస్తా అంటే నిర్మాతలు ఎంత రెమ్యూనిరేషన్ ఇవ్వడానికైనా సిద్ధం గా ఉన్నారు అంత బిజీ గా ఉన్న నటి ఎంత సంపాదిస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఆమె సంపాదన వివరాలు తెలిస్తే అభిమానులకు మతి పోవాల్సిందే. ఆమె ఒక్కో చిత్రానికి దాదాపుగా రెండు కోట్లు తీసుకుంటున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దక్షణాది చిత్ర సీమలో అత్యధిక పారితోషకం తీసుకునే నటి పూజ హెగ్డే అనే చెబుతున్నారు. ముంబై లో బాంద్రా కాంప్లెక్స్ లో 3 బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంది ముంబై స్కైలైన్ వీక్షణతో సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ కోట్లలో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి దాదాపుగా 51 కోట్ల ఆస్థి పూజ కి ఉంటుంది అని తెలుస్తుంది.

ఇక పూజ సినిమా హీరోయిన్ గానే కాకుండా ఆడ్ షూట్స్ లో కూడా నటించడం ఆమె దాదాపు నెలకు 50 లక్షలకి పైగా సంపాదిస్తుంది అని తెలుస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2010 పోటీలో ఆమె రెండవ రన్నరప్‌గా కిరీటాన్ని పొందింది. మిస్కిన్ యొక్క ముగమూడి అనే తమిళ చిత్రం ద్వారా ఆమె ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఇక పూజ హెగ్డే నటించిన రాధే శ్యామ్ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధం గా ఉంది పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం తెరకు ఎక్కింది. ఈ సినిమాలో పూజ ప్రేరణ అనే పాత్రలో ఆమె కనిపిస్తుంది, ఆ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు,టీ- సిరీస్ యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. వంశి ప్రమోద్ ప్రసీద, భూషణ్ కుమార్ తదితరులు ఈ సినిమాకి నిర్మాతలకు గా ఉన్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే రాధే శ్యామ్, ఆచార్య , బీస్ట్, సర్కస్, భగత్ సింగ్ పలు చిత్రాల్లో నటిస్తుంది.

ఆమె ఒక లైలా కోసం అనే చిత్రంలో నాగ చైతన్యతో కలిసి తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది. 2016లో ఆమె అశుతోష్ గోవారికర్ యొక్క మొహెంజో దారోలో హృతిక్ రోషన్‌తో కలిసి హిందీ చలనచిత్ర ప్రవేశం చేసింది. పూజా హెగ్డే రెండవ చిత్రం విడుదలైంది, తెలుగు చిత్రం ఒక లైలా కోసం ఆమె నాగ చైతన్య సరసన నటించింది. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఆమె 62వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ నటిగా నామినేషన్ పొందింది. ఆమె రాబోయే ప్రాజెక్ట్‌లలో ప్రభాస్‌తో రొమాంటిక్ బహుభాషా చిత్రం రాధే శ్యామ్ మరియు చిరంజీవి మరియు రామ్ చరణ్‌లతో కలిసి కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ఆచార్య లో నటిస్తుంది, రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన హిందీ ఫిల్మ్ సర్కస్, ఇందులో ఆమె రణవీర్ సింగ్ సరసన మహిళా ప్రధాన పాత్రలలో ఒకరిగా నటిస్తోంది మరియు తమిళ చిత్రం బీస్ట్ సరసన నటించింది.

9 ఏళ్ల గ్యాప్ తర్వాత తమిళ సినిమాల్లోకి తిరిగి వస్తున్న పూజ హెగ్డే ఇందులో విజయ్ తో కలిసి నటిస్తుంది . 2020లో ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రం కభీ ఈద్ కభీ దీపావళిలో పూజా హెగ్డే నటించింది, ఆ తర్వాత దానికి భాయిజాన్ అని పేరు పెట్టారు. 2021లో ఆమె మహేష్‌తో రెండవసారి మరియు త్రివిక్రమ్‌తో కలిసి వరుసగా మూడవసారి మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల తదుపరి చిత్రంలో కనిపిస్తుందని ప్రకటించారు. పూజ హెగ్డే ఇపుడు టాప్ హీరోస్ అయినా రామ్ చరణ్, అల్లు అర్జున్ , మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోల పక్కన నటించి మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది, ప్రస్తుతం పూజ హెగ్డే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. ఆమె ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనిరేషన్ కూడా కోట్లలో ఉంటుంది అని తెలుస్తుంది ఇక ఆమె సినిమాల కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…