Home Entertainment షాకింగ్..నాగ చైతన్య థాంక్యూ మూవీ కి వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

షాకింగ్..నాగ చైతన్య థాంక్యూ మూవీ కి వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
1
727

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీ థాంక్యూ జూలై 22న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో చైతూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. విక్రమ్ కె. కుమార్ ఈ మూవీని తెరకెక్కించగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య గతంలో మనం వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించాడు. దీంతో ప్రేక్షకులు ఇప్పుడు థాంక్యూ సినిమా పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయి. తొలిరోజు టాక్ పాజిటివ్‌గా వచ్చినా వర్షాల కారణంగా అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ సాధించలేకపోయింది. దిల్ రాజు, విక్రమ్ కె కుమార్, నాగచైతన్య కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు బాగానే బిజినెస్ జరిగింది.

అయితే దిల్ రాజు సొంత బ్యానర్‌లో ఈ సినిమా రావడం, దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ కావడంతో తెలంగాణలో ఆయనే రిలీజ్ చేసుకున్నాడు. ఏపీలో పలు ఏరియాల్లో మాత్రం మంచి రేట్లకు ఈ మూవీని విక్రయించారు. థాంక్యూ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ రూ.35 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌లోనే నిర్మించినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే విడుదలకు ముందే రూ.15 కోట్ల లాభం వచ్చిందని తెలుస్తోంది. అయితే తొలిరోజు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసినా రూ.6.13 కోట్ల గ్రాస్, రూ.3 కోట్ల షేర్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వీకెండ్‌ వరకు రూ.10 కోట్ల షేర్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో 30 శాతం రికవరీ అవుతుంది. తొలిరోజు నైజాంలో రూ.92 లక్షలు, సీడెడ్‌లో రూ.59 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.42 లక్షలు, తూర్పుగోదావరిలో రూ.23 లక్షలు, పశ్చిమగోదావరిలో రూ.24 లక్షలు, గుంటూరులో రూ.22 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.23 లక్షలు, నెల్లూరులో రూ.21 లక్షలు వచ్చినట్లు ట్రేడ్ వెల్లడించింది. అటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో తొలిరోజు రూ.70 లక్షలు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

థాంక్యూ సినిమాకు ముందు బాలీవుడ్‌లో దిల్ రాజు బ్యాక్ టు బ్యాక్ భారీ ప్లాప్‌లను ఎదుర్కొన్నాడు. జెర్సీ, హిట్ సినిమాలు బాలీవుడ్‌లో బోల్తా కొట్టాయి. దీంతో థాంక్యూ ఫలితం దిల్ రాజుకు కీలకంగా మారింది. అందుకే ఈ సినిమాకు టిక్కెట్ రేట్లు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో మల్టీప్లెక్సుల్లో జీఎస్టీతో కలిపి రూ.200, సింగిల్ థియేటర్లలో రూ.150 టిక్కెట్ రేట్లుగా నిర్ణయించామని తెలిపాడు. థాంక్యూ చిత్రంలో నాగచైతన్య మూడు భిన్న గెటప్స్‌లో కనిపిస్తాడు. ఇప్పటికే ఇలాంటి పాత్రను ప్రేమమ్ సినిమాలో చేసినా చైతూ ఇందులోనూ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. రాశీఖన్నా పాత్ర కూడా బాగుంది. అయితే మాళవిక నాయర్ లీడ్ రోల్ పోషించింది. అటు టాలీవుడ్‌లో ఇటీవల టైర్-2 హీరోల సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. నాని నటించిన అంటే సుందరానికీ, గోపిచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్, రామ్ పోతినేని వారియర్ ఇవన్నీ బయ్యర్లకు నష్టాలు మిగిల్చాయి. దీంతో థాంక్యూ ఎలాంటి ఫలితం సాధిస్తుందో వేచి చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…