Home Entertainment షాకింగ్..నాగ చైతన్య కోసం ఎవ్వరు చెయ్యని త్యాగం చేసిన సమంత

షాకింగ్..నాగ చైతన్య కోసం ఎవ్వరు చెయ్యని త్యాగం చేసిన సమంత

0 second read
0
0
2,390

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2010లో వచ్చిన ఏ మాయ చేశావె సినిమాతో అభిమానులందరినీ మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకుంది. తొలి సినిమాలో తనతో నటించిన నాగచైతన్యతోనే ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2021 అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో అటు చైతూ, ఇటు సమంత ఇద్దరూ ప్రకటించడంతో అభిమానులు షాక్ తిన్నారు. వీళ్లిద్దరూ ఎలాంటి కారణం చేత విడిపోయారన్న విషయం ఇప్పటికి ఓ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే విడాకుల తర్వాత సమంత గ్లామర్ విషయంలో జోరు పెంచింది. ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది.

ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్ సిరీస్, పుష్ప సినిమా తర్వాత సమంత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అయినా సమంత తాను స్టార్ హీరోయిన్‌గా ఫీలవకుండా నిత్యం అభిమానులతో సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది. వ్యక్తిగత వివరాలు, సినిమా విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు విమర్శలు ఎదురైనా సమంత వాటిని ఎదుర్కొని లైఫ్‌లో ముందుకు సాగిపోతోంది. తాజాగా సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ సినిమాను సమంత వదులుకుందని టాక్ నడుస్తోంది. కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ అట్లీ, షారుక్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో ‘జవాన్‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాలంటూ చిత్ర యూనిట్ సమంతను సంప్రదించిందట. 2019లోనే దర్శకుడు అట్లీ ఈ మూవీ స్క్రిప్ట్‌ను సమంతకు వినిపించగా అప్పటికి నాగచైతన్యతో వివాహం జరిగి కేవలం రెండేళ్లు మాత్రమే కావడంతో ఆమె కుటుంబ జీవితాన్ని ఆస్వాదించేందుకు ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

అయితే ఆ తర్వాత కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా షారుక్ ఖాన్ జవాన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యమైంది. మరోవైపు సమంత, నాగచైతన్య కూడా విడాకులు తీసుకున్నారు. సమంత జవాన్ సినిమా ఆఫర్‌ను వదులుకోవడంతో దర్శకుడు అట్లీ నయనతారను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జవాన్‌కు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పాన్ ఇండియా మూవీగా జవాన్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది జూన్ 2న ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు అట్లీ నిర్ణయించాడు. ముందుగా ఈ చిత్రానికి ‘లయన్’ అనే టైటిల్‌ పెట్టాలని భావించారు. కానీ చివరకు జవాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి టీజర్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌లో ముఖానికి గాయాలతో బట్ట చుట్టుకొని ఉన్న షారుఖ్ ఖాన్ లుక్ ఇంటెన్సివ్‌‌గా ఉంది. తమిళంలో అట్లీ చేసింది కొన్ని సినిమాలే అయినా ఆయా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సాధించాయి. ముఖ్యంగా నయనతార, ఆర్య కాంబినేషన్‌లో అట్లీ తెరకెక్కించిన రాజా-రాణి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే చాలా మంది వదిలిపెట్టకుండా చూస్తుంటారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…