
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి ఫామిలీ కి ఉన్న స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామ రావు గారు మన తెలుగు జాతిని గర్వించేలా చేసిన మహానుభావుడు అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని..మాస్ బేస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు..ఇక ఆయన తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నందమూరి తారక రామా రావు గారి పేరు ని చిరస్థాయిగా గుర్తునిపోయ్యేంతలాగా చేసాడాయన..ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నేషనల్ లెవెల్ లో ఏ స్థాయి క్రేజ్ ని అనుభవిస్తున్నాడో మన అందరికి తెలిసిందే..ఒక్క తారక రత్న మినహా ఈ కుటుంబం నుండి వచ్చిన హరి కృష్ణ మరియు కళ్యాణ్ రామ్ లు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ ని అందుకున్నారు..ఇప్పుడు నందమూరి అభిమానులు మొత్తం ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్న ఎంట్రీ మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించే..నందమూరి నట వారసుడిగా మోక్షజ్ఞ తేజ కి ఇండస్ట్రీ లోకి ఇంకా రాకముందే మంచి క్రేజ్ ఏర్పడింది.
మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు వచ్చిందంటే చాలు నందమూరి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ లాగ చేస్తారు..సినిమాల్లోకి అడుగుపెట్టకముందే మోక్షజ్ఞ క్రేజ్ ఇలా ఉంటె..ఇక గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుండే అంచనాలు వేస్తున్నారు..మొదట్లో మోక్షజ్ఞ ఉన్న పర్సనాలిటీ ని చూసి అసలు ఇతనికి సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉందా అనే అనుమానం ఉండేది..కానీ స్వయంగా నందమూరి బాలకృష్ణ ఉంటుంది అని క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు..కానీ మోక్షజ్ఞ ఇలాంటి లుక్స్ మైంటైన్ చేస్తే హీరో ఎలా అవ్వగలడు..ఒకవేళ అయినా జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ లో సక్సెస్ అవ్వగలడా అనే అనుమానాలు ఉండేవి..కానీ మోక్షజ్ఞ లుక్స్ పరంగా ఇప్పటి నుండే మొదటి సినిమా కోసం కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తుంది..మొదటి సినిమాతోనే ఆయన సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించబోతున్నాడట..ఈ లుక్ అభిమానులకే కాకుండా..ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపొయ్యేలా చేస్తుందట..ప్రస్తుతానికి మోక్షజ్ఞ తేజ ఎలా ఉన్నాడో మీరే చూడండి.
ఇది ఇలా ఉండగా మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడు అనే టాక్ సోషల్ మీడియా లో గత కొంతకాలం నుండి ప్రచారం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం బాలయ్య బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న అనిల్ రావిపూడి..ఆయనకీ స్టోరీ చెప్తున్నా సమయంలోనే మోక్షజ్ఞ మొదటి సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ వినిపించాడని తెలుస్తుంది..చాలా కాలం నుండి మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం కథలు వింటున్న బాలయ్య కి ఒకటి కూడా సరిగా నచ్చలేదట..కానీ అనిల్ రావిపూడి చెప్పిన కథ ఆయనకీ ఎంతో అద్భుతంగా నచ్చినట్టు తెలుస్తుంది..మరోపక్క మోక్షజ్ఞ మొదటి సినిమా బోయపాటి శ్రీను తో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయట..బోయపాటి శ్రీను బాలయ్య బాబు కి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తన కెరీర్ ని మలుపు తిప్పే సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను తో మొదటి సినిమా లాంచ్ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉన్నాడట బాలయ్య..అతి త్వరలోనే మోక్షజ్ఞ మొదటి సినిమాకి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.