
నందమూరి తారక్ రత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని తెలిసిందే. ప్రస్తతం కుటంబ సభ్యులు అందరు బెంగుళూరు లోనే హాస్పిటల్ వద్ద ఉంటున్నారు. నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఉన్నారు. బాలకృష్ణ దగ్గర ఉండి మరి తారక్ రత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటారు..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాస్పిటల్ కి వెళ్లి వ్యైధులు కి మంచి వైద్యం అందించాలి అని అడిగారు. ఇది ఇలా ఉండగా, బెంగళూరులోని ఆసుపత్రిలో పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్, టీటీడీ సభ్యులైన చల్లా రామచంద్రారెడ్డి కూడా ఉండటం జరిగింది. తారక్ రత్న భార్య అలేఖ్య రెడ్డి మరెవెరో కాదు, చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కుమార్తె..అంతే కాదు వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి చెల్లెలి కూతురు.
తారక్ రత్న గురించి తెలుసుకుని అయన కుటుంబ సభ్యులు కొద హాస్పిటల్ కి చేరుకొని నందమూరి కుటుంబ సభ్యులకి అండగా ఉంటున్నారు. డాక్టర్స్ చెప్పడం ప్రకారం తారక్ పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అన్నయ్య ని చూసేందుకు ఆదివారం నాడు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ బెంగుళూరు వెళ్లి చూసారు. ఈ ఇద్దరినీ విమానాశ్రయం నుంచి కర్ణాటక వైద్యఆరోగ్య శాఖా మంత్రి కె.సుధాకర్ దగ్గరుండి మరీ వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు..తారక్ రత్న పిల్లలు తమ తండ్రిని చూసి బాధ పడుతున్నారు. కుటుంబ సభ్యులు వాళ్లకి ధైర్యం చెప్పడం జరిగింది. అతని పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యులు నిరంతరం అప్‌డేట్ చేస్తారు. అతని క్లినికల్ పరిస్థితిలో ఏవైనా మార్పులు అవసరమైతే తెలియజేయబడుతుంది. గోప్యత మరియు నిరంతరాయమైన చికిత్సను అందించడంలో ప్రజలు మాకు మద్దతునివ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము, వారు చెప్పారు.
తారకరత్నకు వెంటిలేటర్ సపోర్టు ఉండగా, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కానీ అతని గుండె మరియు మూత్రపిండాల పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించిందని మరియు పురోగతి తగినంత స్థిరంగా ఉన్నట్లయితే అతను వెంటిలేటర్ సపోర్ట్‌ను తీసివేయవచ్చని కూడా వినబడింది. నందమూరి తారక రత్న జనవరి 27న కుప్పంలో గుండెపోటుకు గురై 45 నిమిషాల పాటు పునరుజ్జీవనం పొంది ప్రాథమిక చికిత్స అందించి కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు..”జనవరి 28న తెల్లవారుజామున 1 గంటలకు ఆయనను రోడ్డు మార్గంలో నారాయణ హృదయాలయకు తరలించారు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది మరియు అతని పరిస్థితిని మూల్యాంకనం ప్రామాణిక మార్గదర్శకాలు మరియు ప్రోటోకాల్‌ల ప్రకారం చికిత్సతో కొనసాగుతుంది” అని హెల్త్ బులెటిన్.