Home Entertainment షాకింగ్..చనిపోయిన తర్వాత కృష్ణంరాజు తన ఆస్తులను ఎవరి పేరు మీద రాశాడో తెలుసా?

షాకింగ్..చనిపోయిన తర్వాత కృష్ణంరాజు తన ఆస్తులను ఎవరి పేరు మీద రాశాడో తెలుసా?

0 second read
0
0
1,241

రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల తుదిశ్వాస విడిచారు. తన చివరి కోరిక ప్రభాస్ పెళ్లి చూడకుండానే కృష్ణంరాజు మరణించడం పలువురిని ఆవేదనకు గురిచేస్తోంది. అటు కృష్ణంరాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోయిన కొన్నాళ్లకు రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు ఎవ్వరికీ వివాహం కాలేదు. ఇప్పుడు వారి పెళ్లిని ప్రభాస్ జరిపించాల్సి ఉంటుంది. అయితే ప్రభాస్ తాను పెళ్లి చేసుకుని చెల్లెళ్ల పెళ్లి జరిపిస్తాడా లేదా వాళ్ల వివాహాలు చక్కపెట్టాకే తాను పెళ్లి చేసుకుంటాడా అన్న విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కృష్ణంరాజు 40 ఏళ్లకు పైగా సినిమాల్లో నటించి ఎన్నో ఆస్తులను కూడబెట్టుకున్నారు. రాజకీయాల్లోనూ మంచి పదవులు అనుభవించడంతో ఆయనకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అంతేకాకుండా వారసత్వంగా కృష్ణంరాజుకు మొగల్తూరులో కొన్ని వందల ఎకరాల భూమి వచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు స్వతహాగా కూడగట్టిన ఆస్తుల విషయానికి వస్తే చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలలో మొత్తం నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. చనిపోయేవరకు జూబ్లీహిల్స్‌లో ఆయన నివాసం ఉన్న ఇంటి ఖరీదు అక్షరాలా 18 కోట్ల రూపాయలు.

మరోవైపు హైదరాబాద్ నగర శివారులో కృష్ణంరాజుకు ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. సినిమా షూటింగ్‌లు లేని సమయంలో ప్రభాస్ ఎక్కువగా అక్కడే గడిపేవాడు అని తెలుస్తోంది. అటు గోపీకృష్ణ నిర్మాణ సంస్థను కూడా కృష్ణంరాజు స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. నిర్మాతగానూ బాగానే కాసులు వెనకేసుకున్నారు. కార్ల విషయానికి వస్తే కొన్ని కోట్ల విలువ గల ఖరీదైన కార్లు కృష్ణంరాజుకు ఉన్నాయి. ఓవరాల్‌గా కృష్ణంరాజు ఆస్తి విలువ రూ.800 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇదంతా కేవలం కృష్ణంరాజు ఆస్తి మాత్రమేనని.. ప్రభాస్, ఆయన తండ్రి ఆస్తులు కూడా వేరే ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు జన్మించిన కృష్ణంరాజుది ఆది నుంచి సంపన్న కుటుంబమే. 2009లో కృష్ణంరాజు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తన కుటుంబానికి 8 కోట్ల 62 లక్షల రూపాయల ఆస్తులు, రెండు కోట్ల 14 లక్షల అప్పులు ఉన్నట్లు చూపించారు. అంతేకాకుండా కుమార్తెల పేరు మీద కొన్ని బాండ్లు కూడా ఉన్నాయి. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.

మొత్తంగా చూసుకుంటే కృష్ణంరాజు అన్ని ఆస్తుల విలువ కలిపి దాదాపు 1000 కోట్ల దాకా ఉంటుందట. ప్రస్తుతం ఎలా చూసినా కృష్ణంరాజు ఆస్తి అంతా రెండో భార్య, ముగ్గురు పిల్లల దగ్గరే ఉంది. 1,000 కోట్ల రూపాయలలో ముగ్గురు కూతుళ్లకు సమానంగా వాటాలు చెందాలని కృష్ణంరాజు వీలునామా రాసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రభాస్ కు తన తదనంతరం ఒక భవనం వచ్చే విధంగా కూడా ఆయన వీలునామాలో రాశారట. కానీ మొదటి భార్యకు ఓ కుమార్తె ఉందని.. ఇప్పుడు ఆస్తిలో తనకు కూడా వాటా రావాలని ఆమె పట్టుబడుతోందని టాక్ నడుస్తోంది. చట్ట ప్రకారం చూసుకుంటే తొలి భార్యకు కూడా కృష్ణంరాజు ఆస్తి దక్కాలి. కానీ ఇప్పుడు ఆమె జీవించిలేదు కనుక ఆమె కుమార్తెకు ఆస్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభాస్, అతడి బంధువులు ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. మొదటి భార్య కుమార్తెకు ఎంత ఆస్తి అప్పగిస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. కృష్ణంరాజు రెండో భార్యకు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీళ్లు మాత్రమే కాకుండా మొదటి భార్య సీతాదేవి కుమార్తె కూడా కృష్ణంరాజు వద్దే ఉంటుంది. అలాగే మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు శ్యామలాదేవి దంపతులు ఐదుగురు ఆడపిల్లలకు తల్లిదండ్రులుగా ఉంటున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…