
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు చంద్రమోహన్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎందుకంటే ఈయన దాదాపు ప్రతి హీరో సినిమాలో ఉంటాడు..తండ్రి పాత్రలకు తనకు తానె సాటి అని నిరూపించుకున్న చంద్రమోహన్ ఒక్కపుడు చాల పెద్ద హీరోనే..ఈయన తో చేసిన హీరోయిన్లు అంటారు పెద్ద స్టార్స్ అయ్యారు,ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో చక్రం తిప్పిన మహానటి శ్రీదేవి మొదటి సినిమా కూడా చంద్ర మోహన్ తోనే చేసింది..నిన్న మొన్నటి వరుకు ముఖ్య పాత్రల కోసం చంద్రమోహన్ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు,కానీ ఈమధ్య ఏమైందో ఏమో తెలీదు కానీ చంద్రమోహన్ సినిమాలు చెయ్యడం బాగా తగ్గించేసాడు..తండ్రి పాత్రలకు ఇటీవల ఈయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది..కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన సినిమాలకు ప్రస్తుతం తాత్కాలిక విరామం ఇచ్చినట్టు తెలుస్తోంది,ఇది ఇలా ఉండగా ప్రస్తుతం చంద్రమోహన్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము.
చంద్రమోహన్ కుటుంబానికి సంబంధించిన ఒక్క అమ్మాయి ఒక్కే ఒక్క సినిమాతో పెద్ద హీరోయిన్ అయ్యింది అంటే మీరు నమ్ముతారా?? అవును మీరు వింటున్నది నిజమే,చంద్ర మోహన్ సొంత తమ్ముడు గారి కూతురు ప్రముఖ దర్శకుడు కే.విశ్వనాద్ దర్శకత్వం లో వచ్చిన సప్తపది అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది..ఈమె పేరు సబితా..అప్పట్లో విశ్వనాధ్ తెరక్కించిన ఈ సప్తపది చిత్రం ఎంతతి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా లో హీరోయిన్ గా చేసిన సబితా కి ఎక్కడలేని క్రేజ్ ని తీసుకొచ్చింది..ఎందుకంటే ఆమె పాత్ర కి అంతటి బలం ఉంది ఆ సినిమాలో..ఈ సినిమా తర్వాత ఆమెకి వరుస పెట్టి సినిమా ఆఫర్లు వచ్చిన ఆమె సున్నితంగా తిరస్కరించి అటు పిమ్మట వివాహం చేసుకొని సినిమాలకి శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసింది..ప్రస్తుతం ఈమె ఒక్క ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తోంది.
సబితా తొలుత చంద్రమోహన్ తనకి పెద్ద నాన్న అవుతాడు అనే విషయమే విశ్వనాధ్ గారికి తెలియదు అట..తొలి నుండి క్లాసికల్ డాన్సర్ అయినా సబితా ఒకానొక్క ఈవెంట్ లో డాన్స్ ప్రదర్శన ఇచ్చింది అట..ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా కే.విశ్వనాద్ గారు విచ్చేసారు..ఆ ఈవెంట్ లో ఈమె చేసిన కూచూపుడి నాట్యం ,అభినయం ఎంతగానో ఆయనని ఆకర్షించాయి అట..అప్పటికే తాను తియ్యబోయ్యే సప్తపది సినిమా కోసం హీరోయిన్ అన్వేషణలో ఉన్న విశ్వనాధ్ కి ఈ అమ్మాయి ఎంత గానో నచ్చింది అట..వెంటనే ఆ అమ్మాయి వద్ద కి వెళ్లి నా సినిమాలో హీరోయిన్ వేషం వేస్తావా అని అడగగా ఏమి సమాధానం చెప్పాలో తెలియక అక్కడి నుండి తలా దించుకొని ఆమె వెళ్ళిపోయింది అట..తర్వాత విశ్వనాథ్ గారు స్వయంగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమె తల్లి తండ్రులను ఒప్పించి సప్తపది సినిమాలో నటింపచేసేలా చేసాడు..ఇలా చంద్రమోహన్ కుటుంబం నుండి ఒక్కరు సినీ ఇండస్ట్రీ కి వచ్చి ఒక్క సంచలన విజయం సాధించిన సినిమా లో హీరోయిన్ అనే విషయమే మనకి తెలియదు కదూ!..బహుశా ఆమె హీరోయిన్ గా మరి కొన్ని సినిమాలు ఒప్పుకొని ఉంటే ఈరోజు సినీ ఇండస్ట్రీ లో ఏ స్థాయిలో ఉండేదో మరి.