
కొత్త బంగారు లోకం సినిమాతో ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసిన శ్వేతాబసు గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా శ్వేతా బసు మారిపోయింది. అయితే కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. తర్వాత పలు ఐటం సాంగ్‌లలో నటించినా జనాలు పట్టించుకోలేదు. దీంతో శ్వేతా బసు ఫేడ్ అవుట్ అయిపోయింది. అయితే ప్రస్తుతం మరోసారి శ్వేతా బసు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మళ్లీ బిజీ అవుతోంది. గునేగర్ అనే హిందీ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను త్వరలో పలకరించనుంది. ఈ సిరీస్ శ్వేతా బసుకు మరోసారి గుర్తింపు ఇస్తుందని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
బీహార్ ప్రాంతానికి చెందిన శ్వేతా బసు చిన్నతనంలో హిందీ సినిమాలలోనే నటించింది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా పలు సీరియళ్లలోనూ నటించి అందరినీ ఆకట్టుకుంది. అలా చేస్తున్న సమయంలోనే బాలీవుడ్‌లో కొన్ని సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. జనవరి 11న జంషెడ్ పూర్‌లో జన్మించిన ఆమె నటించిన మొదటి హిందీ సినిమా ఫిర్ బి హిందూస్తానీ. ఈ సినిమా తర్వాత ఆమె 2002లో మక్దే అనే ఓ హిందీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఈ సినిమాకు శ్వేతాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డ్ వచ్చింది. బాలీవుడ్ సినిమాలతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కళ్లలో పడిన శ్వేతా బసు కొత్త బంగారు లోకం సినిమాతో ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఈ మూవీలో ఎక్కడా అంటూ ముద్దు ముద్దుగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత రైడ్, కళావర్ కింగ్, కాస్కో లాంటి సినిమాల్లో శ్వేతా బసు నటించింది. అయితే అకస్మాత్తుగా లావుగా మారిపోవడంతో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి.
మరోవైపు వ్యభిచార ఆరోపణల్లో అరెస్ట్ కావడం కూడా శ్వేతా బసు కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కొత్త బంగారులోకం సినిమాలో చాలా క్యూట్‌గా కనిపించే ముద్దుగుమ్మ 30 ఏళ్లకే ముదురు హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె కెరీర్ డౌన్‌లో ఉన్నప్పుడే రోహిత్ మిట్టల్ అనే ఒక ఫిలిం మేకర్‌ను వివాహం చేసుకుంది.. కానీ వివాహమైన ఏడాదికి వీరిద్దరూ విడిపోయారు. దీంతో మరోసారి సినిమా అవకాశాల కోసం శ్వేతా బసు ప్రయత్నించింది. 2014 నుంచి పలు హిందీ సినిమాల్లో చిన్న క్యారెక్టర్లను కూడా పోషిస్తోంది. మధుర్ బండార్కర్ తెరకెక్కించిన ఇండియా లాక్‌డౌన్ అనే సినిమాలోనూ నటించింది. లాక్ డౌన్ సమయంలో ముంబైలోని రెడ్‌లైట్‌లోని సెక్స్ వర్కర్లు ఎలాంటీ ఇబ్బందులను ఫేస్ చేశారు.. వారి సమస్యలను తెలుసుకోవాడానికి శ్వేతాబసు స్వయంగా రెడ్‌లైట్ ఏరియాకు కూడా వెళ్లింది. ప్రస్తుతం గునేగర్ అనే వెబ్ సిరీస్‌తో పాటు క్రిమినల్ జస్టిస్ సీజన్-3లో కనిపిస్తుంది. ఇందులో ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేఖ పాత్రను పోషిస్తోంది.