Home Entertainment షాకింగ్..’కాంతారా’ సినిమాని వదులుకున్న ప్రముఖ స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

షాకింగ్..’కాంతారా’ సినిమాని వదులుకున్న ప్రముఖ స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
4,887

ఒక హీరో చెయ్యాల్సిన సినిమా కొన్ని అనుకోని పరిస్థితుల వాళ్ళ మరో హీరో చేసిన సందర్భాలు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎన్నో జరిగాయి..ఆ తర్వాత కొన్నేళ్ళకు ఆ విషయం బయటపడిన తర్వాత సదరు హీరో అభిమానులు ‘అయ్యో..ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాని మా హీరో మిస్ అయ్యాడా’ అని ఆ హీరో అభిమానులు బాధపడుతుంటారు..అలా లేటెస్ట్ గా పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతున్న ‘కాంతారా’ సినిమాకి కూడా రిషబ్ శెట్టి ముందుగా తానూ ఈ సినిమాలో హీరోగా చెయ్యాలి అని అనుకోలేదట..కేవలం దర్శకత్వం ఒక్కటి చూసుకుంటే చాలు అని అనుకున్నాడట..అలా ఆయన ఆ ప్రాజెక్ట్ ని ఒక అగ్ర హీరో తో చెయ్యాలనే కలతో అతని వద్దకి వెళ్లి స్టోరీ చెప్పాడట..ఇంతకీ ఆ అగ్ర హీరో మరెవరో కాదు..దివంగత శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారే..కన్నడ లో పవర్ స్టార్ అని అభిమానులు దైవంలాగా ఆరాధించే ఈయన గుండెపోటు తో ఆకస్మిక మరణం పొందడం అందరిని షాక్ కి గురి చేసింది.

అది అలా కాసేపు పక్కనా పెడితే కాంతారా సినిమా స్టోరీ ని పునీత్ రాజ్ కుమార్ తో పాన్ ఇండియా లెవెల్ లో భారీగా తియ్యాలి అనేది రిషబ్ శెట్టి కోరిక అట..ఈ సినిమా స్టోరీ ని పునీత్ రాజ్ కుమార్ గారికి చెప్పినప్పుడు చాలా థ్రిల్ కి గురై ఆయన రిషబ్ శెట్టి ఒక సలహా ఇచ్చాడట..కథ వింటూ ఉంటే నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి..ఈ కథ నువ్వు నాకు చెప్తున్నప్పుడు నీ కళ్ళలో లో ఉన్న ఉత్సహం ని నేను గమనించాను..ఇది నీ ఊరి కథ..నువ్వు చేస్తేనే సహజం గా ఉంటుంది..ఎప్పటి నుండో హీరో గా పెద్ద స్టార్ వి అవ్వాలి అని అనుకుంటూ ఉండేవాడివి కదా..నాకు ఎందుకు నువ్వు ఎదురు చూసిన స్థాయి ఈ సినిమాతో దక్కుతుంది అనిపిస్తుంది..ఈ కథ నాతో వద్దు..ఏ హీరో తో కూడా చెయ్యొద్దు..నువ్వే హీరో గా చెయ్యి అని రిషబ్ శెట్టి వెన్నుతట్టి ప్రోత్సహించి పునీత్ రాజ్ కుమార్ గారే ఈ కథని అతనితో చేయించాడట.

పునీత్ రాజ్ కుమార్ ఇచ్చిన సలహాని అనుకరించిన రిషబ్ శెట్టి కి నేడు జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపు లభించిందో మన అందరికి తెలిసిందే..రిషబ్ శెట్టి ఇంతకు ముందు డైరెక్టర్ గా కన్నడలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసాడు..మధ్య మధ్యలో చిన్న చిన్న పాత్రలు కూడా చేసాడు కానీ..హీరో గా పరిచయం అయ్యింది మాత్రం ‘బెల్ బాటమ్’ అనే సినిమా ద్వారా మాత్రమే..ఇక ఆ తర్వాత కాంతారా సినిమాతో ఆయన ఏ స్థాయి గుర్తింపుని దక్కించుకున్నాడో ఇప్పుడు మన అందరం చూస్తూనే ఉన్నాము..కేవలం రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటి వరుకు 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..కలెక్షన్ల ప్రవాహం ఇప్పట్లో ఆగే ప్రసక్తే కనిపించకపోవడం తో మరో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ సినిమా అవలీలగా అందుకుంటుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…