
టాలీవుడ్ యాంకర్లలో సుమ తర్వాత స్థానం కచ్చితంగా శ్రీముఖిదే. ఎందుకంటే యాంకర్ శ్రీముఖి తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో కాక రేపుతుంటుంది. పొట్టి బట్టలు వేస్తూ తొడలు కనిపించేలా డ్రస్సులు వేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. రెండేళ్ల క్రితం యాంకరింగ్‌కు విరామం ఇచ్చి బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. బిగ్ బాస్‌లో అల్లరి చిల్లరి పనులతో ఆకట్టుకుంది. దీంతో ఆ సీజన్ రన్నరప్‌గా నిలిచి ఇంటా బయట మరింత పాపులారిటీ సంపాదించుకుంది. బిగ్‌బాస్ తర్వాత శ్రీముఖికి మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇప్పటికీ శ్రీముఖి చేతిలో చాలా షోలు ఉన్నాయి. పండగ సందర్భంగా ఛానళ్లు నిర్వహించే కార్యక్రమాల్లో శ్రీముఖి తప్పనిసరిగా కనిపిస్తుంటుంది. దీంతో శ్రీముఖి ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అన్న విషయం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అయితే శ్రీముఖి రెమ్యునరేషన్ విన్న నెటిజన్‌లు నోరెళ్లబెడుతున్నారు.
శ్రీముఖి ప్రస్తుతం ఈటీవీ, ఈటీవీ ప్లస్, స్టార్, జీ తెలుగు వంటి ఛానళ్లలో యాంకరింగ్ చేస్తోంది. పలు షోలకు హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖి ఒక్కో షోకు రూ. 5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక్క ఏడాదిలో శ్రీముఖి రూ.5 కోట్లు సంపాదిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే వీటిలో సినిమాల రెమ్యునరేషన్ కూడా ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. విచిత్రం ఏంటంటే టాప్ యాంకర్ సుమ కంటే శ్రీముఖి రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకోవడం. యాంకర్ సుమ ఒకరోజు కాల్షీట్‌కు రూ.లక్ష వరకు తీసుకుంటుంటే.. శ్రీముఖి మాత్రం ఒక్కో కాల్షీట్‌కురూ.3 లక్షల వరకు తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీముఖి రెమ్యునరేషన్ విషయంలో ఆమె అధికారికంగా స్పందించాల్సి ఉంది. యాంకర్‌గా శ్రీముఖి ఉంటే ఆయా షోలలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా ఉండదని అభిమానులు భావిస్తున్నారు. దీంతో బుల్లితెర రాములమ్మగా కూడా శ్రీముఖి పేరు తెచ్చుకుంది.
శ్రీముఖి ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై ఏకకాలంలో నటిస్తూ క్రేజ్ సంపాదిస్తోంది. గతంలో జులాయి, నేను శైలజ లాంటి సినిమాల్లో నటించిన శ్రీముఖి ఇటీవల నితిన్ మ్యాస్ట్రో, క్రేజీ అంకుల్స్ వంటి సినిమాలను చేసింది. అటు శ్రీముఖి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తే చాలు వాటికి లక్షల్లో, వేలలో లైక్స్‌తో పాటు కామెంట్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. మరోవైపు శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఫిలింనగర్‌లో కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్‌లు బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా అంటే కాలమే సమాధానం చెప్పాలి. శ్రీముఖి ఇతర సినిమాల విషయానికి వస్తే ఇట్స్ టైమ్ టూ పార్టీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.