Home Entertainment షాకింగ్..ఒక్కడు సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

షాకింగ్..ఒక్కడు సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

2 second read
0
0
797

ప్రతి హీరో కెరీర్ ని మలుపు తిప్పే ఒక్క సినిమా ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు..అలా మన సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఒక్కడు..అప్పటి వరుకు చాలా మామూలు హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు ని రాత్రికి రాత్రి స్టార్ హీరోని చేసిన చిత్రం ఇది..అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి టాలీవుడ్ టాప్ 2 హిట్ గా నిలిచింది..మృగరాజు వంటి ఫ్లాప్ సినిమా తర్వాత గుణ శేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తనని తానూ ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు..ఆయన కష్టానికి తగిన ఫలితం ఈ సినిమా ద్వారా దక్కేసింది..తెలుగు లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళ్ లో విజయ్ ‘గిల్లి’ అనే పేరు తో రీమేక్ చేసాడు..అక్కడ పెద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా అప్పట్లో తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి విజయ్ కి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది..ఇక ఇదే ఒక్కడు సినిమా కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ‘అజయ్’ అనే పేరు తో రీమేక్ చేసాడు..అక్కడ కూడా పెద్ద హిట్టే..ఇక హిందీ లో అర్జున్ కపూర్ ‘తేవార్’ అనే పేరు తో రీమేక్ చేసాడు..అక్కడ కూడా పెద్ద హిట్..ఇలా ఈ సినిమా అన్ని ప్రాంతీయ బాషలలో సూపర్ హిట్ గా నిలిచి అక్కడి హీరోలకు స్టార్ ఇమేజి ని ఇచ్చింది.

అలాంటి సెన్సషనల్ హిట్ సినిమాని మన టాలీవుడ్ లో ఒక్క స్టార్ హీరో మిస్ చేసుకున్నాడట..ఆ హీరో మరెవరో కాదు.మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కాల్సింది..విలన్ గా ప్రకాష్ రాజ్ కి ముందు అప్పటికే జయం సినిమాతో విలన్ గా మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న గోపీచంద్ ని అనుకున్నారు..అయితే అప్పట్లో ప్రభాస్ డేట్స్ వేరే సినిమాకి కమిట్ అవ్వడం తో ఈ సినిమా ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది..అయితే ఎలా అయినా ప్రభాస్ తో సినిమా చెయ్యాలనే దృఢ సంకల్పం తో ఉన్న సుమంత్ ఆర్ట్స్ అధినేత MS రాజు..తదుపరి సంవత్సరం లో ప్రభాస్ ని హీరో గా పెట్టి గోపీచంద్ విలన్ గా వర్షం సినిమా తీసాడు..ఈ సినిమా ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇక ప్రభాస్ తో చెయ్యాల్సిన ఒక్కడు సినిమాని సూపర్ స్టార్ మహేష్ తో చేసాడు..రెండు ఇండస్ట్రీ ని ఒక్క ఊపు ఊపిన సినిమాలే కావడం విశేషం.

ఇది ఇలా ఉండగా తన నిర్మాణ సంస్థ లో ల్యాండ్ మార్క్ గా నిలిచినా ఒక్కడు సినిమాకి సీక్వెల్ ని త్వరలోనే తియ్యబోతున్నాడట MS రాజు గారు..భారీ బడ్జెట్ మరియు భారీ తారాగణంతో అన్ని ప్రాంతీయ బాషలలో ఈ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట..అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తాడా లేదా అనేది అయితే తెలియదు కానీ, సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ మీద మాత్రం ఒక్కడు సినిమాకి సీక్వెల్ తియ్యడానికి బలంగా నిర్ణయించుకున్నాడట MS రాజు..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..19 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 20 కోట్ల కి పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది..అంతే కాకుండా అప్పట్లో ఈ సినిమా 130 కేంద్రాల్లో శత దినోత్సవం..4 కేంద్రాలలో 175 రోజులు ఆడి సంచలనం సృష్టించింది..మహేష్ కెరీర్ లో ఈ రేంజ్ ల్యాండ్ మార్క్ గా నిలిచినా ఈ సినిమాకి సీక్వెల్ తియ్యడం అంటే మాములు విషయం కాదు..చూడాలి మరి సీక్వెల్ తో కూడా అదే స్థాయిలో అలరిస్తారో లేదో అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…