Home Entertainment షాకింగ్ ఎలిమినేషన్..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి గీతూ అవుట్!

షాకింగ్ ఎలిమినేషన్..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి గీతూ అవుట్!

2 second read
0
0
7,339

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రస్తుతం 8వ వారానికి చేరుకుంది. 8వ వారంలో కంటెస్టెంట్ల మధ్య కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ వారం హౌస్‌లో ఉన్నవాళ్లంతా ఎలిమినేషన్‌లో ఉన్నారు. గతవారం టాలీవుడ్ టాస్క్ ఫ్లాప్ కావడంతో బిగ్‌బాస్ అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్ రద్దు చేశాడు. దీంతో ఈ వారం హౌస్‌కు కెప్టెన్ ఎవరూ లేరు. దీంతో అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. కనీసం నామినేషన్స్‌లో ఉంటే అయినా పోటీగా ఆడతారని భావిస్తూ ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లను బిగ్‌బాస్ నామినేషన్‌లో ఉంచుతున్నాడు. 8వ వారం ఏకంగా 13 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, రేవంత్, శ్రీహాన్, రాజ్, ఫైమా, శ్రీసత్య, సూర్య, వాసంతి, రోహిత్, మెరీనా, కీర్తి భట్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ ట్రెండ్‌ను చూసుకుంటే రేవంత్‌కు అత్యధిక ఓట్లు పడుతున్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో శ్రీహాన్ ఉన్నాడు. 35 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతున్నాయి.

అటు ఓటింగ్‌లో మూడో స్థానంలో మెరీనా ఉండటం విశేషం. గతవారం చివరిస్థానంలో ఉన్న ఆమె ఈ వారం అనూహ్యంగా మూడో స్థానానికి దూసుకొచ్చింది. మరోవైపు చాలా మంది కంటెస్టెంట్ల స్థానాలు ఓటింగ్‌లో మారుతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే గత వారం వరకు టాప్-5లో ఉన్న సూర్య ఈ వారం అట్టడుగు స్థాయికి పడిపోయాడు. సూర్య, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజ్ ప్రస్తుతానికి డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం రివ్యూవర్ గీతూ హౌస్ నుంచి వెళ్లిపోతుందనే సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే ఈ వారం గీతూ చెత్త సంచాలక్‌గా వ్యవహరించి బాలాదిత్య టీంను ఎలాగైనా పక్కకు తప్పించడానికి శతవిధాలుగా ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. దీంతో గీతూకు ఓట్లు ఎక్కువగా పడలేదని తెలుస్తోంది. 8వ వారం బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌గా శ్రీహాన్ ఎంపికయ్యాడు. చేపల టాస్కులో టాప్-4 జంటల్లో ఉన్న 8 మందిలో ఒక్కో జంట నుంచి ఒక్కొక్కరు చొప్పున కెప్టెన్సీ పోటీదారులుగా తేల్చుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు.

ఈ నేపథ్యంలో నాలుగు జంటల్లో నలుగురు ఎంపిక కావాల్సి ఉంది. దీంతో ఇనయ-రేవంత్ జంట నుంచి రేవంత్.. సూర్య, వాసంతి జంట నుంచి సూర్య, శ్రీహాన్ శ్రీ సత్య జంట నుంచి శ్రీహాన్, రోహిత్ కీర్తి జంట నుంచి రోహిత్ అలాగే ఫైమా, రాజ్ జంట నుంచి ఫైమా ఈ నలుగురు నెక్స్ట్ లెవల్‌కు ఎంపిక అయ్యారు. ఇనయ కెప్టెన్ అవ్వాలని.. అవకాశం కోసం రేవంత్‌ని చాలా బ్రతిమిలాడింది. అయితే చివరికి చీటీలు వేసుకోవడంతో లక్ రేవంత్ వైపు ఉండటంతో రేవంత్ కెప్టెన్సీ పోటీలో నిలిచాడు. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఫైమాలు కెప్టెన్సీ పోరులో తలపడగా.. వీరికి చిక్కుల్లో కెప్టెన్సీ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కి వాసంతి సంచాలక్‌గా వ్యవహరించింది. ఈ లెవల్‌లో రేవంత్ డిస్ క్వాలిఫై కావడంతో.. సూర్య, కీర్తి, శ్రీహాన్‌లు నెక్స్ట్ లెవల్‌కి వెళ్లారు. ఆ తరువాత ఈ ముగ్గురికీ కెప్టెన్ అవ్వడానికి అడుక్కునే ప్రాసెస్ పెట్టారు. అయితే ఇంటి సభ్యుల సపోర్ట్‌తో శ్రీహాన్ 8వ వారం కెప్టెన్ అయ్యాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…