Home Entertainment షాకింగ్..ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

షాకింగ్..ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
2,718

ఇటీవల కాలం లో టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ లాగ దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి..ఉప్పెన సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే నటన పరంగాను మరియు అందం పరంగాను కోట్లాది మంది యువకుల మనసులను కొల్లగొట్టి రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..తొలి సినిమా సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో కృతి శెట్టి కి టాలీవుడ్ బడా హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చేస్తున్నాయి..ఉప్పెన తర్వాత ఆమె చేసిన శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు వంటి సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది వారియర్’ నిన్ననే విడుదల అయ్యి అద్భుతమైన ఓపెనింగ్ ని దక్కించుకుంది..వాస్తవానికి ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది..కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ములేపేస్తుంది..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఈ సినిమా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..ఇదంతా కృతి శెట్టి లెగ్గు మహిమ అంటూ ఇండస్ట్రీ లో జోరుగా ప్రచారం సాగుతుంది..ఈమె ఉంటె కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా టాలీవుడ్ బడా నిర్మాతలకు పట్టుకుంది..అందుకే ఈమె ఇంటి ముందు వారంతా క్యూ కడుతున్నారు.

కేవలం తెలుగు లో మాత్రమే కాదు..తమిళం లో కూడా ఈమెకి బీభత్సమైన క్రేజ్ ఉంది అనే చెప్పాలి..ఇప్పటి వరుకు ఈమె నటించిన సినిమాలు తమిళం లో ఒకటి కూడా విడుదల కాకపోయినప్పటికీ కూడా అక్కడ వరుసగా క్రేజీ స్టార్ హీరోల సినిమాల్లో బుక్ అవుతూ పోతుంది..ఇప్పటికే ఈమె అక్కడ మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది..అందులో ఒకటి వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కే సినిమా కాగా..మరొకటి సూర్య మరియు బాల కాంబినేషన్ లో తెరకెక్కతున్న సినిమా ఒకటి..ఈ రెండు సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి..ఇటీవలే ఆమె మరో క్రేజీ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించడానికి సంతకం చేసింది..ఇలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే కృతి శెట్టి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోతూ వెళ్తుంది..ఇదంతా పక్కన పెడితే ఈమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే..ఇది ఇలా ఉండగా ఇటీవల వారియర్ మూవీ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్న కృతి శెట్టి తనకి తమిళ ఫిలిం ఇండస్ట్రీ లో జరిగిన ఒక చేదు అనుభవం ని పంచుకుంది.

అదేమిటి అంటే తమిళం లో ఒక స్టార్ హీరో కొడుకు కృతి శెట్టి పై మనసు పడ్డాడట..ఇటీవలే ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు..ఈ పార్టీ కి రావాల్సిందిగా అతను కృతి శెట్టి కి ఫోన్ చేసి పిలిచాడట..ఈ పార్టీ కి నువ్వు వస్తే ఇప్పటి వరుకు ఎన్నడూ చూడని రేంజ్ డబ్బులను ఇస్తాను అన్నాడట..అంతే కాకుండా అతను చాలా తేడాగా మరియు అసభ్యంగా కూడా మాట్లాడాడట..దీనితో కృతి శెట్టి కి విషయం అర్థం అయ్యి, ‘సారీ నేను రాను..నువ్వు అనుకునే టైపు అమ్మాయిని నేను కాదు’ అంటూ కాల్ కట్ చేసింది అట..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు..ఎందుకు ఇంత నీచంగా ప్రవర్తించాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది..ఇది ఇలా ఉండగా కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య తో ఒక సినిమా ,అలాగే నితిన్ తో మాచెర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…