
టాలీవుడ్ లో మెగా ఫామిలీ కి మరియు దగ్గుపాటి ఫామిలీ కి ఎలాంటి సన్నిహిత్య సంబంధం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వీళ్ళ మధ్య సొంత బంధువులు మరియు అన్నదమ్ముల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో, అదే స్థాయి సంబంధం ఉంటుంది..చిరంజీవి మరియు వెంకటేష్ ఎప్పుడు కలిసినా కూడా అభిమానులకు ఒక కనుల పండుగలాగా ఉంటుంది..అయితే వీళ్లిద్దరు నిజ జీవితం లో కూడా బంధువులు కావాల్సిన వారు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ కి మొదటి నుండి రామ్ చరణ్ అంటే బాగా ఇష్టం..ఎందుకంటే చిన్నప్పుడు వీళ్లంతా ఒకే కాలనీ లో ఉంటారు కాబట్టి రామ్ చరణ్ వెంకటేష్ ఇంటికి వెళ్తుండడం మరియు రానా రామ్ చరణ్ ఇంటికి వెళ్లి ఆదుకుంటుండడం తరుచూ జరుగుతూ ఉండేవి..అలా రామ్ చరణ్ ని బాల్యం నుండే బాగా గమనిస్తూ వచ్చాడు వెంకటేష్..చిరంజీవి గారితో కూడా ఆయనకి మంచి రిలేషన్ ఉండడం తో తన పెద్ద కూతురు ఆశ్రిత ని రామ్ చరణ్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడట వెంకటేష్.
ఇదే విషయం ని చిరంజీవి కి చెప్పగా ఆయన కూడా ఎంతో సంతోషించి వీళ్లిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకున్నాడట..రామ్ చరణ్ దగ్గరకి వెళ్లి ఈ పెళ్లి ప్రస్తావన తీసుకొని రాగ అప్పుడు రామ్ చరణ్ తనతో ఉపాసన తో ప్రేమ వ్యవహారం గురించి చెప్పాడట..ఇక చేసేది ఏమి లేక రామ్ చరణ్ చెప్పిన విషయాన్నీ వెంకటేష్ కి ఇబ్బంది పడుతూనే వివరించాడట..వెంకటేష్ చాలా కూల్ గా సమాధానం ఇస్తూ ‘ఇది చెప్పడానికి ఎందుకు అంత మొహమాటం పడుతున్నారు అండీ..పర్లేదు పిల్లల ఇష్టాఇష్టాలను గౌరవించడం మన కర్తవ్యం’ అని చెప్పి చాలా తేలికగా ఆ విషయాన్నీ తీసుకున్నాడట వెంకటేష్..కానీ చిరంజీవి కి ఇప్పటికి గిల్టీ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది అని అంటుంటారు ఇండస్ట్రీ లో పెద్దలు..ఇక రామ్ చరణ్ ప్రేమ సంగతి తెలిసిన తర్వాత ఉపాసన ఇంట్లో వారితో మాట్లాడి అతిరధ మహారధుల సమక్షం లో అంగరంగ వైభవం గా రామ్ చరణ్ – ఉపాసన పెళ్లిని జరిపించారు చిరంజీవి..వీళ్లిద్దరి పెళ్లి జరిగి పదేళ్లు కూడా దాటిపోయింది.
ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే రామ్ చరణ్ – ఉపాసన లు అతి త్వరలోనే తల్లి తండ్రులు కాబోతున్నారు అట..ఇటీవలే గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఉపాసన లేటెస్ట్ ఫోటోలను గమనిస్తే ఆమెకి బేబీ బంప్(గర్భవతి) కనిపించింది..దీనితో రామ్ చరణ్ ఫాన్స్ తమ వదిన తల్లి కాబోతుంది..త్వరలోనే మనకి వారసుడు రాబోతున్నాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు..అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు..అలా అని ఈ వార్త ని కొట్టిపారేయలేదు కూడా..కాబట్టి ప్రస్తుతానికి ఉపాసన గర్భవతి అనే విషయాన్నీ గోప్యంగానే ఉంచినట్టు తెలుస్తుంది..ఇక రామ్ చరణ్ సినిమాల విషయం కి వస్తే ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది..అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యబోతున్నారు.