
టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలో అగ్రహీరోయిన్‌గా ఎదిగిన నటీమణుల్లో ఆర్తి అగర్వాల్ ఒకరు. ఆమె తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి చిన్న వయసులోనే కన్నుమూసింది. పాగల్ పన్ అనే హిందీ మూవీతో సినిమాల్లోకి రంగప్రవేశం చేసిన ఆర్తి అగర్వాల్ తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాను ఆర్తి కోసమే పలువురు అభిమానులు పదే పదే చూశారంటే ఆమె నటన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో వరుసగా అగ్రహీరోల సినిమాల్లో ఆర్తి అగర్వాల్ అవకాశాలు సంపాదించింది. చిరంజీవితో ఇంద్ర, బాలయ్యతో పల్నాటి బ్రహ్మనాయుడు, నాగార్జునతో నేనున్నాను, వెంకీతో సంక్రాంతి, వసంతం వంటి సినిమాల్లో నటించింది.
అగ్రహీరోలతో నటిస్తూనే యువ హీరోలతోనూ ఆర్తి అగర్వాల్ పోటీ పడి నటించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో అల్లరి రాముడు, ప్రభాస్‌తో అడవి రాముడు, మహేష్‌బాబుతో బాబీ, ఉదయ్ కిరణ్‌తో నీ స్నేహం, తరుణ్‌తో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు వంటి సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపుగా ఐదేళ్ల పాటు టాలీవుడ్‌లో ఆర్తి హవా కొనసాగింది. తాజాగా ఆర్తి అగర్వాల్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోయిన సమయంలో ఆర్తి అగర్వాల్ ఓ నిర్మాత దగ్గర ఎక్కువగా గడిపేది అని.. అతడి ఫామ్‌హౌస్‌కు కూడా వెళ్లేది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవకాశాలు ఇస్తానంటూ ఆ నిర్మాత కూడా ఆర్తిని తన చుట్టూ తిప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు నిర్మాత ఎవరు అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
అయితే సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోయిన సమయంలో సునీల్ వంటి హీరోల పక్కన కూడా ఆర్తి నటించింది. రాజశేఖర్ నటించిన గోరింటాకు సినిమాలో ఏకంగా విలన్ పాత్రలోనూ నటించి శభాష్ అనిపించుకుంది. అయితే యువ హీరో తరుణ్‌తో ప్రేమాయణం కారణంగా ఆర్తి కెరీర్ డిస్ట్రబ్ అయ్యిందని అప్పట్లో రూమర్లు వినిపించేవి. కానీ తరుణ్ వాళ్ల ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆర్తితో బ్రేకప్ జరిగిందని కూడా ప్రచారం జరిగింది. ఇంతలో బరువు కూడా పెరిగిపోవడంతో సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. సినిమా ఛాన్సుల కోసం సర్జరీలు చేయించుకోవడంతో ఆరోగ్యంపై ప్రభావం పడింది. 2015లో గుండెపోటుతో చిన్న వయసులోనే ఆర్తి అగర్వాల్ మృతి చెందింది. ఆమె నటించిన చివరి సినిమా ఆమె ఎవరు. ఈ మూవీ విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలియదు.