
సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది గొప్ప టాలెంట్ ఉన్న నటీనటులు దీనిని ఒక్క మాధ్యమం గా వాడుకొని, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి కోట్లాది మంది అభిమానులను పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు,వీళ్ళకి ఉన్న క్రేజ్ సినిమా యాక్టర్ కి ఉన్న క్రేజ్ కి ఏ మాత్రం తక్కువ కాదు, ఆలా యూట్యూబ్ మరియు టిక్ టాక్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని సంపాదించుకున్న పాపులర్ సెలబ్రిటీ షణ్ముఖ్ జస్వంత్, ఇతని వీడియోస్ కి యూట్యూబ్ లో ఎలాంటి క్రేజ్ ఉండదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,యువత మొత్తం ఇతని షార్ట్ ఫిలిమ్స్ కి అడిక్ట్ ఐపోతున్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదు, వైవా అనే షార్ట్ ఫిలిం ద్వారా బాగా పాపులర్ అయినా షణ్ముఖ్ ఆ తర్వాత వైవా టీం తీసే షార్ట్ ఫిలిమ్స్ లో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా నవ్వించాడు, ఆ తర్వాత ఆయన తన సొంతంగా ఒక్క యూట్యూబ్ ఛానల్ సృష్టించుకొని ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసాడు, వీటిల్లో సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే షార్ట్ ఫిలిం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా అలరించిన ఈ షార్ట్ ఫిలిం కి 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద హిట్ అయ్యిందో.
కెరీర్ మంచి ఊపు లో పోతున్న సమయం లో షణ్ముఖ్ కి ఇటీవల జరిగిన ఒక్క సంఘటన ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది, ఇటీవల ఆయన హైదరాబాద్ లో పార్టీ కి వెళ్లి బాగా త్రాగి డ్రైవింగ్ చేస్తూ మూడు కార్లను గుద్దిన ఘటన సంచలనం రేపిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే ప్రధాన చర్చ, అయితే ఎలాంటి ప్రాణ హాని జరగకపోవడం తో షణ్ముఖ్ లైఫ్ కి మరియు అతని కెరీర్ కి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదు అనే చెప్పాలి, కానీ ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకి దూసుకుపోతున్న షణ్ముఖ్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో ఇర్రుకోవడం అనేది ఒక్క మచ్చ అనే చెప్పొచ్చు, ప్రస్తుతం ఆయన పోలీసు కస్టడీ లోనే ఉన్నాడు, ప్లీజ్ అన్న నన్ను వదిలేయండి అన్న అంటూ షణ్ముఖ్ పోలీసులను బ్రతిమిలాడుతున్న వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది, మార్ పక్క షణ్ముఖ్ అభిమానులు కూడా తమ అభిమాన నటుడు ఇలా చెయ్యడం పై తీవ్రమైన నిరాశలో ఉన్నారు.
ఇది ఇలా ఉండగా షణ్ముఖ్ ప్రస్తుతం సూర్య అనే షార్ట్ ఫిలిం లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇటీవలే తన ఛానల్ లో అప్లోడ్ చేసిన రెండు ఎపిసోడ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది,ఇలా అతను తీస్తున్న సూర్య షార్ట్ ఫిలిం కూడా మంచి హిట్ అయినా సందర్భం లో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం బాధాకరం అనే చెప్పాలి, ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది,ఇక షార్ట్ ఫిలిమ్స్ తో పాటు షణ్ముఖ్ కి మరో క్రేజీ ఆఫర్ కూడా వచ్చింది, సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ రాబొయ్యే 5 వ సీజన్లో ఒక్క కంటెస్టెంట్ గా పాల్గొనడానికి షణ్ముఖ్ కి అద్భుతమైన అవకాశం దక్కింది, ఇటీవల స్థార్ మా యాజమాన్యం ఈ విషయమై షణ్ముఖ్ ని సంప్రదించగా ఆయన కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభం కాబోతున్న ఈ షో ద్వారా షణ్ముఖ్ తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర కానున్నాడు.