Home Entertainment శ్రీహాన్ – రేవంత్ కంటే శ్రీసత్య కి ఎక్కువ డబ్బులు ఇచ్చిన బిగ్ బాస్..15 వారాలకు అన్ని లక్షల రెమ్యూనరేషనా!

శ్రీహాన్ – రేవంత్ కంటే శ్రీసత్య కి ఎక్కువ డబ్బులు ఇచ్చిన బిగ్ బాస్..15 వారాలకు అన్ని లక్షల రెమ్యూనరేషనా!

0 second read
0
0
200

వివాదాల నడుమ ఊహించని మలుపులతో బిగ్ బాస్ సీజన్ 6 మొత్తానికి ముగిసింది..మొదటి ఎపిసోడ్ నుండి డిజాస్టర్ రేటింగ్స్ తో ప్రారంభమైన ఈ సీజన్ చివరి వరుకు అదే రేంజ్ రేటింగ్స్ తో ముందుకెళ్లింది..ఊహించని ఎలిమినేషన్స్ ఈ షో పాలిట శాపం గా మారింది..అంతే కాకుండా రేవంత్ , చంటి , బాలాదిత్య మరియు శ్రీ సత్య వంటి వారు తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ ఎవ్వరు కూడా ప్రేక్షకులకు పెద్దగా ముఖపరిచయం లేని వాళ్ళు..అందుకే ఆడియన్స్ మొదట్లో పెద్దగా ఆసక్తి చూపలేదు..ఆ తర్వాత టాస్కులు ఆసక్తికరం గా కొనసాగించారు , కొద్ది రోజులు డీసెంట్ స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి కానీ ముందు సీజన్స్ రేటింగ్స్ తో పోలిస్తే దరిదాపుల్లోకి కూడా రాలేదు..ఇక గ్రాండ్ ఫినాలే కూడా అంచలనాలకు అందకుండా ప్లాన్ చేసారు..రేవంత్ కంటే శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చినా, శ్రీహాన్ కి 40 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు రేవంత్ కి 10 లక్షల క్యాష్ , ఇల్లు, కార్ మరియు ట్రోఫీ ఇచ్చారు.

అయితే రెమ్యూనరేషన్ విషయం లో వీళ్లిద్దరికీ శ్రీ సత్య కంటే చాలా తక్కువ వచ్చింది..కారణం శ్రీ సత్య కి యూత్ లో మంచి క్రేజ్ ఉండడం వల్లే..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే ఆమె టీవీ సీరియల్స్ మరియు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది..అందం లో హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని శ్రీ సత్య కి సీరియల్స్ లో మాత్రం హీరోయిన్ రోల్స్ ఎవ్వరు ఇవ్వలేదు..అన్ని లేడీ విలన్ రోల్స్ ఇచ్చేవారు..వాటి ద్వారానే ఈమె పాపులారిటీ సాధించింది..అంతే కాకుండా బిగ్ బాస్ షో ని కేవలం శ్రీ సత్య అందం కోసం చూసే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది..అందుకే విన్నర్ మరియు రన్నర్ కంటే ఎక్కువ పారితోషికం అందుకుంది అని ఫిల్మ్ నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది..ఈమెకి కేవలం ఒక్క రోజుకి 23 వేల రూపాయిల చొప్పున ఇచ్చారట.

అలా 15 వారాలు హౌస్ లో ఉంది కాబట్టి, ఈ 15 వారాలకు గాను ఆమెకి 34 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చినట్టు సమాచారం..అంతే శ్రీహాన్ గెలుచుకున్న క్యాష్ ప్రైజ్ 40 లక్షలతో దాదాపుగా సమానం గా అన్నమాట..ఇక శ్రీహాన్ కి 15 వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు గాను 7 లక్షల 50 వేల రూపాయిలు మాత్రమే ఇచ్చారట..రేవంత్ కి దాదాపుగా 15 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ముట్టినట్టు తెలుస్తుంది..ఏదైనా శ్రీ సత్య కి ఉన్న ఆర్ధిక ఇబ్బందులకు ఈ బిగ్ బాస్ షో చాలా సహాయం చేసిందనే చెప్పాలి..ఈ డబ్బులతో ఆమె తన తల్లికి కాళ్ళ ఆపరేషన్ చేయించవచ్చు..వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయినట్టే..ఇక సీరియల్స్ మరియు సినిమాల్లో కూడా ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయి..ఇక నుండి అయిన ఆమెకి హీరోయిన్ రోల్స్ ఇస్తారో..లేదా ఎప్పటిలాగానే విలన్ రోల్స్ ఇస్తారో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…