
బిగ్‌బాస్ షో రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు సిరి, శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ ఐదో సీజన్ ద్వారా సిరి, ఆరో సీజన్ ద్వారా శ్రీహాన్ క్రేజ్ తెచ్చుకున్నారు. హౌస్‌లో ఇద్దరు కూడా టాప్ కంటెస్టెంట్లుగా తమ సత్తా చాటుకున్నారు. అయితే గత సీజన్‌లో షన్నూతో సిరి రిలేషన్ షిప్ కొంచెం అతిగా కనిపించింది. ముఖ్యంగా షన్నూ టైటిల్ గెలవకపోవడానికి సిరితో రిలేషన్‌షిప్ అని కూడా ప్రచారం జరిగింది. వీళ్లిద్దరూ చీటికి మాటికి ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. ఒక దశలో ఫ్యామిలీ వీక్ సమయంలో సిరి వాళ్ల పేరెంట్స్ కూడా కౌగిలింతలు, ముద్దులు తగ్గించాలని అందరిముందు బహిరంగంగానే చెప్పారు. షన్నూతో రిలేషన్ షిప్ కారణంగా సిరికి శ్రీహాన్‌తో రిలేషన్ షిప్ దెబ్బతింటుందని పలువురు అంచనా వేశారు. కానీ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక సిరి, శ్రీహాన్ ఎప్పటిలాగే కలిసి ఉన్నారు. తమపై వచ్చిన నెగిటివిటీకి చెక్ చెబుతూ మరింత దగ్గరయ్యారు.
కట్ చేస్తే ఈ సీజన్‌లో ఆది నుంచే శ్రీహాన్ చాలా జాగ్రత్తగా ఆడాడు. ఎవరితోనూ ఎక్కువ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేయలేదు. శ్రీసత్యతో ఫ్రెండ్ షిప్ చేసినా తన హద్దుల్లోనే ఉన్నాడు. తనకు సిరి ప్రాణమని.. సిరితో తాను కమిట్ అయ్యాయని హౌస్‌లో అందరికీ చెప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి శ్రీహాన్‌తో బ్రేకప్ అయ్యిందని సిరి చెప్పడం అందరికీ షాక్‌ను కలిగిస్తోంది. శ్రీహాన్‌తో ఎందుకు బ్రేకప్ అయ్యిందో సిరి వివరించింది. బిగ్‌బాస్ నుంచి తాను బయటకి వచ్చాక శ్రీహాన్‌తో చాలా గొడవలయ్యాయని… దీంతో ఇద్దరం కలవడం, మాట్లాడటం మానేశామని తెలిపింది. ఆల్మోస్ట్ విడిపోయామని కూడా చెప్పుకొచ్చింది. శ్రీహాన్ నుంచి దూరమయ్యాక తనకు కోవిడ్ వచ్చిందని.. దీంతో చాలా రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఉంచానని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత శ్రీహన్ కాల్స్, మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టాడని.. ఒక రోజు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంక లైఫ్‌లో ఎప్పటికీ కనిపించను అని మెసేజ్ పెట్టాడని… అందుకే వెంటనే కాల్ చేశానని… అప్పుడు రోడ్ మీద నడుస్తూ ఉంటే తనను వచ్చి తీసుకెళ్లాడని తెలిపింది. ఈ ఘటన కారణంగా ఇప్పుడు గతంజన్ ఆరంభంలోనే అతడు తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి దృష్టిలో కంటే ఎక్కువ క్లోజ్ అయ్యామని సిరి చెప్పింది.
ప్రస్తుతం బిగ్‌బాస్ ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉంటుంది. ఇప్పటివరకు శ్రీహాన్ విజయం కోసం సిరి ఎంతో కృషి చేసింది. సోషల్ మీడియా ద్వారా శ్రీహాన్‌కు తన శక్తి మేర ప్రచారం చేసింది. సీజన్ ఆరంభం నుంచే శ్రీహాన్ తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించి స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. ప్రతి టాస్క్ గెలిచేలా తన శక్తి మేర శ్రీహాన్ ఆడతాడు. హౌస్‌లో చాలా సార్లు సిరిని గుర్తుకుతెచ్చుకుంటాడు. వీరిద్దరూ ఇప్పటికే ఒక బాబుని దత్తత తీసుకున్నారు. ఇటీవల ఫ్యామిలీ వీక్ సమయంలో హౌస్‌లోకి సిరి వచ్చింది. అంతేకాకుండా బాబును కూడా తీసుకొచ్చింది. వీళ్లను చూసిన శ్రీహాన్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తప్పకుండా టైటిల్ గెలవాలని.. జాగ్రత్తగా ఆడమని శ్రీహాన్‌కు సిరి సీక్రెట్‌గా చెప్పింది. ఎవరినీ తేలికగా నమ్మవద్దని కూడా హితవు పలికింది. సిరి తనను కలిసి వెళ్లాక తనలో చాలా మార్పులు వచ్చాయని వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున దగ్గర శ్రీహాన్ చెప్పాడు. టికెట్ టు ఫినాలే టాస్కులో కూడా శ్రీహాన్ విజేతగా నిలిచాడు. కసిగా ఆడే రేవంత్‌ను కాదని ఈ టాస్కులో శ్రీహాన్ విజయం సాధించాడు. కాగా వచ్చే ఏడాది శ్రీహాన్‌ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సిరి వెల్లడించింది.