
బిగ్‌బాస్-6 విన్నర్‌గా సింగర్ రేవంత్ టైటిల్ దక్కించుకున్నాడు. రన్నరప్‌గా శ్రీహాన్, టాప్-3 కంటెస్టెంట్‌గా కీర్తి, టాప్-4 కంటెస్టెంట్‌గా ఆదిరెడ్డి, టాప్-5 కంటెస్టెంట్‌గా రోహిత్ నిలిచారు. అయితే ఈ సీజన్‌లో తొలిసారిగా విన్నర్ కంటే రన్నరప్ ఎక్కువ నగదు గెలుచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. విన్నర్‌గా నిలిచిన రేవంత్ రూ.10 లక్షలు మాత్రమే గెలుచుకోగా రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్ రూ.40 లక్షలను సొంతం చేసుకున్నాడు. ఈ పరిణామం బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి అని అందరూ చెప్పుకుంటున్నారు. రేవంత్ అభిమానులు కూడా ఈ విషయంపైనే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా ఈ అంశంపై తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్ తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని ఆదిరెడ్డి తెలిపాడు. ఆదిరెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని వరికుంటపాడు. అతడిది రైతు కుటుంబం. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ఇంజినీరింగ్ చదివాడు.
బిగ్‌బాస్ హౌస్‌లో ఓట్ల ప్రకారమే ఎలిమినేషన్‌లు జరిగాయని ఆదిరెడ్డి వివరించాడు. టాప్-5లో నిలిచినందుకు సంతోషంగా ఉందని.. తన ఆట అక్కడివరకే ప్రేక్షకులకు నచ్చడంతోనే ఈ తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డాడు. అయితే శ్రీహాన్, రేవంత్ ఇద్దరూ బాగా ఆడారని.. రేవంత్ కంటే శ్రీహాన్ సన్నగా ఉన్నా టాస్కులలో గట్టి పోటీ ఇచ్చాడని.. టాప్ పొజిషన్ అనేది ప్రేక్షకుల ఇష్టమని.. కాంపిటేషన్ అన్న తర్వాత ఒకరు మాత్రమే విజేత అవుతారని ఆదిరెడ్డి వివరించాడు. అయితే విన్నర్ కంటే రన్నరప్‌కు ఎక్కువ నగదు రావడం తప్పు అని ఆదిరెడ్డి అన్నాడు. తన వరకు చూసుకుంటే రూ.కోటి ఇచ్చినా తీసుకునేవాడిని కాదని.. ఎందుకంటే అది విన్నర్ అమౌంట్ అని తెలిపాడు. కానీ శ్రీహాన్ కూడా డబ్బు తీసుకోవడంలో తప్పు లేదన్నాడు. రేవంత్, శ్రీహాన్ ఇద్దరూ మంచి స్నేహితులు అని.. వాళ్లిద్దరిలో ఒకరు విన్నర్, ఒకరు రన్నర్ అని క్లారిటీ వచ్చినప్పుడు నష్టపోకూడదని ఇలా చేసి ఉండొచ్చని ఆదిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశాడు. విన్నర్ అమౌంట్ తీసుకోవడం తనకు నచ్చదని.. ఏదైనా గెలుచుకుని సొంతం చేసుకోవాలన్నదే తన అభిమతమని ఆదిరెడ్డి చెప్పాడు. తనకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేటప్పుడు ఎంతో సిగ్గు ఉండేదని.. ముఖ్యంగా అమ్మాయిలతో చాలా దూరంగా ఉండేవాడిని అని తెలిపాడు.
కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత తనకు గీతూ, ఫైమా మంచి స్నేహితులుగా ఉన్నారని.. వాళ్లు కూడా బాగా ఆడారని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. కీర్తి కూడా చాలా బాగా ఆడిందని అందుకే టాప్-5 వరకు వచ్చిందని తెలిపాడు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఉన్నప్పుడు నెగిటివ్ పాయింట్లు మాత్రమే మాట్లాడాల్సి వచ్చేదని.. కానీ అందరిలో పాజిటివ్ పాయింట్లు కూడా ఉండేవని ఆదిరెడ్డి అన్నాడు. బిగ్‌బాస్ చరిత్రలో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్‌లు ఎప్పుడూ జరగలేదన్నాడు. అందరూ ఓట్ల ప్రకారమే ఎలిమినేట్ అయ్యారని.. తన ఆట గురించి కూడా తనకు ఓ అంచనా ఉందన్నాడు. కాగా ఆదిరెడ్డి సామాన్యుడి స్థాయి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా, ఆ తరువాత టాప్ -4 లో ఒకడిగా నిలవడం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పాలి. ఆదిరెడ్డి బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా ప్రేక్షకుల మనస్సును మాత్రం గెలిచాడు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.