
రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఐదు సీజన్లతో పాటు ఓటీటీ సీజన్ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆరో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. బిగ్‌బాస్ వల్ల చాలా మంది క్రేజ్ తెచ్చుకుని సినిమా అవకాశాలు పొందుతున్నారు. ఈ షో వల్ల ఎంతో మంది లాభపడ్డారు. వారిలో సిరి హన్మంత్ కూడా ఉంది. ఆమె ఐదో సీజన్లో బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్ జశ్వంత్‌తో కలిసి సందడి చేసింది. ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఆరో సీజన్లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే టిక్కెట్ టు ఫినాలేను శ్రీహాన్ గెలుచుకున్నాడు. సీజన్ ఆరంభం నుంచే శ్రీహాన్ తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించి స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. మధ్యలో కొన్ని పొరపాట్లు చేసినా చివరి వరకూ నెగ్గుకొచ్చాడు. లోపల అతడు ఆడుతుంటే బయట మాత్రం గర్ల్‌ఫ్రెండ్ సిరి హన్మంత్ సపోర్ట్ చేస్తోంది. హౌస్ లోపల సిరిని ఎవరు ఏమన్నా శ్రీహాన్ ఊరుకునేవాడు కాదు. ఆమె అంటే అతడికి చాలా ఇష్టం. కాదు ప్రాణమని చెప్పాలి.
అయితే బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీహాన్ ఉండగానే అతడికి సిరి బ్రేకప్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరి నిర్వహించే బీబీ కేఫ్‌లో సిరి గెస్ట్‌గా పాల్గొంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో అరియానా ఓ యూట్యూబ్ థంబ్ నెయిల్‌ను సిరికి చూపించింది. సదరు థంబ్ నెయిల్లో సిరి జ్ఞాపకాలన్నీ తీసేసిన శ్రీహాన్ అని ఉంది. ఇది నిజమేనా అని అరియానా ప్రశ్నించింది. దీంతో సిరి ఎమోషనల్ అయ్యింది. అలాంటివి ఏమీ లేవని.. తమ వ్యక్తిగత జీవితంలో ఎన్నో గొడవలు జరిగాయని సిరి చెప్పుకొచ్చింది. అయితే సిరి, శ్రీహాన్ మధ్య గొడవలు రావడానికి ఓ వ్యక్తి కారణమని తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సి ఉంటుంది. మరోవైపు శ్రీహాన్‌ను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని సిరి క్లారిటీ ఇచ్చింది. బహూశా వచ్చే ఏడాది తమ పెళ్లి ఉండొచ్చని స్పష్టం చేసింది. గతంలో పెళ్లి కాకుండానే తల్లిని అయినట్లు వచ్చిన వార్తలు అవాస్తవయని సిరి చెప్పింది. తమ దగ్గర పెరుగుతున్న బాబును దత్తత తీసుకున్నామని చెప్పింది.
అయితే సిరి, శ్రీహాన్ పెంచుకుంటున్న బాబు సిరి సొంత మేనమామ కొడుకు అని తెలుస్తోంది. అతడి పేరు చైతూ. ఇటీవల ఫ్యామిలీ వీక్ సందర్భంగా సిరితో పాటు చైతూ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా చైతూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందర్నీ ఇమిటేట్ చేస్తూ సూపర్ ఫన్ అందించాడు. ఆడుతూ పాడుతూ చాలా యాక్టివ్‌గా కనిపించాడు. సిరి, శ్రీహాన్ కలవడంతో ఈ ఎపిసోడ్ ఎంతో రొమాంటిక్‌గా, క్యూట్‌గా సాగింది. సిరి వచ్చి వెళ్లిన తర్వాత శ్రీహాన్‌లో చాలా మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని హౌస్‌మేట్స్‌తో పాటు హోస్ట్ నాగార్జున కూడా చెప్పాడు. దీంతో అతడు తరచూ దీనిపై బాధ పడుతున్నాడు. బయట మంచి ఫాలోయింగ్ ఉండటంతో రేవంత్‌కు శ్రీహాన్ మంచి పోటీ ఇస్తున్నాడు. శ్రీహాన్ ఈ సీజన్ టైటిల్ గెలిచేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం బయట శ్రీహాన్, సిరిలు ఒకేచోట ఉంటున్నారు కానీ వారికి ఇంకా వివాహం కాలేదు. కాగా ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో టికెట్ 2 ఫినాలే ద్వారా ఫైనల్లోకి అడుగు పెట్టిన వారిలో ఒకే ఒక్కరు బిగ్ బాస్ కప్ గెలుచుకున్నారు. అతడే కౌశల్. అప్పటినుంచి ఇప్పటివరకు టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నవారు టైటిల్ గెలుచుకోలేదు. మరి శ్రీహాన్ కౌశల్ రికార్డును అందుకుంటాడో లేదో చూడాలి.