
టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో వారి కుటుంబ సభ్యులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. మెగాస్టార్ ఫ్యామిలీలో అయితే ఈ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరు కుమార్తెల గురించి అభిమానులు కూడా ఆరాలు తీస్తుంటారు. చిన్నకూతురు శ్రీజ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. తొలుత శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. ఆ తర్వాత అతడికి డైవర్స్ ఇచ్చి తన తండ్రి చెప్పిన కళ్యాణ్‌దేవ్‌ను పెళ్లి చేసుకుంది. అతడితో కూడా ఓ బిడ్డను కన్నాక ఏవో మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. విడాకుల గురించి బయటకు చెప్పకపోయినా కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిగా ఉండటాన్ని మీడియా ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉంది.
తాజాగా శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. శ్రీజ తన బెస్ట్ ఫ్రెండ్‌ను మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నవంబర్ నెలాఖరులో శ్రీజ పెళ్లి జరగబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ పెళ్లి మెగా ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదని.. అందుకే సింపుల్‌గా మ్యారేజ్ చేసుకోవాలని శ్రీజ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు మెగాస్టార్ తనకు ఇష్టం లేకపోయినా కూతురి సంతోషం కోసం మూడో పెళ్లికి అంగీకారం తెలిపారని.. అయితే కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలు ఎక్కువైపోయారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌తో పాటు వరుణ్ తేజ్, నిహారిక, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ పేరు ఉపయోగించుకొని కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని మెగా అల్లుడు అని పిలిపించుకుని మరో వ్యక్తి కూడా సినిమాల్లో రావడం తనకు ఇష్టం లేదని మెగాస్టార్ చెప్పారట.
ఒకవేళ హీరోగా ఇండస్ట్రీలోకి వెళ్లాలనే కోరిక ఉన్నా అతడికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయకూడదని మెగాస్టార్ కండిషన్ పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఈ షరతుకు మెగా అభిమానులు కూడా మద్దతు ఇస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు శ్రీజ విషయంలో అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. ఇంత జరుగుతున్నా కూడా ఒక్కరు కూడా బయటికి వచ్చి జరిగిన విషయం ఇది.. జరుగుతున్న మ్యాటర్ ఇదే అంటూ క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు కళ్యాణ్ దేవ్ తన సన్నిహితులతో పరిస్థితులు చెప్పుకుని బాధ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా శ్రీజ మూడో పెళ్లి చిరంజీవికి ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఒప్పించారని టాక్ వినిపిస్తోంది. కాగా చిరంజీవి ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులను తన ముగ్గురు పిల్లలకు సమానంగా వాటాలు చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దాంతో రామ్ చరణ్‌తో పాటు చిరంజీవి కూతుళ్లు శ్రీజ, పెద్ద కూతురు సుస్మితకు సమానంగా ఆస్తులు పంచబోతున్నట్టు టాక్. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.