
మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తొలుత శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అయితే శిరీష్‌తో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయినా తోడు కోసం రెండో పెళ్లి చేసుకుంది. కళ్యాణ్‌దేవ్‌ను పెళ్లి చేసుకుంది. శ్రీజను పెళ్లాడిన తర్వాత కళ్యాణ్‌దేవ్ హీరోగా కూడా నటించాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు.. ఉన్నట్టుండి వీళ్లిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్, శ్రీజ విడివిడిగా జీవిస్తున్నారు. శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తన భర్త కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. కట్ చేస్తే ప్రస్తుతం శ్రీజ ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధం అవుతోందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. తన క్లోజ్ ఫ్రెండ్‌తో శ్రీజ మళ్ళీ ప్రేమలో పడ్డిందని, దీంతో త్వరలోనే ఆమె మూడో పెళ్లి చేసుకుంటుందని టాక్ నడుస్తోంది.
తాజా పరిణామాలతో శ్రీజ విషయంలో అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందన్న విషయం అభిమానులకు అర్ధం కావడం లేదు. శ్రీజ మూడో పెళ్లిపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎవరూ స్పందించలేదు. అయితే మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్లు మాత్రమే ఈ తరహా వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వార్తలకు చెక్ పడాలంటే శ్రీజ లేదా మెగా ఫ్యామిలీ నుంచి స్పందన రావాలని కొందరు కోరుకుంటున్నారు. మరోవైపు శ్రీజ విషయం తెలిసి కళ్యాణ్‌దేవ్ తనలో తానే కుమిలిపోతున్నాడని.. తన పరిస్థితి గురించి సన్నిహితుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. శ్రీజకు దూరంగా ఉన్నప్పటి నుంచి కళ్యాణ్ దేవ్ నటించిన సినిమాలను పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. సూపర్ మచ్చి, కిన్నెర సాని సినిమాలలో కళ్యాణ్ దేవ్ నటించిన విషయం కూడా చాలామందికి తెలియదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీజ గతంలో భర్తతో చిల్ అయ్యే ఫోటోలను అభిమానులకు షేర్ చేసేది. ఇప్పుడు భర్తను పట్టించుకోకుండా పిల్లలే నా ప్రాణం అంటూ పోస్టులు పెడుతోంది. దీంతో కళ్యాణ్‌దేవ్‌తో విడాకులు తీసుకుందని చాలా మంది కన్‌ఫర్మ్ చేసేశారు. శ్రీజ కూడా కళ్యాణ్‌దేవ్‌తో విడాకుల గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. కళ్యాణ్‌దేవ్, శ్రీజ దంపతులకు కూడా ఓ పాప పుట్టింది. మరి ఇప్పుడు శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటానంటే మెగా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా లేదా అడ్డు చెప్తుందా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీల మధ్య ఎంత త్వరగా ప్రేమ పుడుతుందో.. అంతే త్వరగా మనస్పర్థలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో నాగచైతన్య-సమంత, అమీర్ ఖాన్-కిరణ్ రావు, ధనుష్-సౌందర్య రజినీకాంత్ చేరిపోయారు. ఇప్పుడు కళ్యాణ్ దేవ్, శ్రీజ జంట కూడా వీరి సరసన చేరిపోయింది. అంతేకాకుండా ఇటీవల సింగర్లు హేమచంద్ర, శ్రావణభార్గవి కూడా విడిపోతున్నారని వార్తలు వచ్చాయి.