Home Entertainment శ్రీజా తో విడాకులు గురించి తొలిసారి స్పందించిన కళ్యాణ్ దేవ్

శ్రీజా తో విడాకులు గురించి తొలిసారి స్పందించిన కళ్యాణ్ దేవ్

0 second read
0
1
22,918

మన టాలీవుడ్ లో ఇటీవల కాలం లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది, గత మూడు నెలల క్రితం సమంత మరియు నాగ చైతన్య ల జంట విడిపోయిన సంగతి మన అందరికి తెలిసందే, వీళ్లిద్దరు విడిపోవడం ని అభిమానులే కాదు,సాధారణ ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేక ఉన్నారు,వీళ్ళ లాగానే తమిళనాడు లో ధనుష్ మరియు ఐశ్వర్య(రజినీకాంత్ కూతురు) జంట 18 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలు ఎదిగిన తర్వాత విడాకులు తీసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది,ఈ షాక్ నుండి తేరుకునేలోపు మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గారి రెండవ కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకుంటున్నట్టు చాలా కాలం నుండి ఒక్క వార్త సోషల్ మీడియా లో సెన్సేషన్ రేపుతోంది,ఇప్పుడు ఈ వార్త పై రోజుకో వార్త సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది,శ్రీజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తన పేరు నుండి కళ్యాణ్ దేవ్ పేరు ని తొలగించి శ్రీజ కొణిదెల అని మార్చినప్పటి నుండి ఈ వార్తలు ఊపిరి పోసుకున్నాయి,అంతే కాకుండా కళ్యాణ్ దేవ్ చాల కాలం నుండి మెగా ఫామిలీ కి దూరం గా ఉంటూ రావడం, మెగా ఫామిలీ కుటుంబం కి సంబంధించిన ముఖ్యమైన వేడుకులకు దూరంగా ఉండడం లాంటివి మెగా అభిమానులు ఎంతో కాలం నుండి గమనిస్తూనే ఉన్నారు, నేడు పరోక్షంగా శ్రీజ చెప్పకనే చెప్పడం తో ఇక వీళ్లిద్దరు విడాకులు తీసేసుకున్నారు అనే నిర్ధారణకు వచ్చేసారు అభిమానులు.


ఇక అసలు విషయానికి వస్తే కళ్యాణ్ దేవ్ కి సినిమాల పట్ల ఉన్న అమితాసక్తిని గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో హీరోగా విజేత అనే సినిమా ద్వారా పరిచయం చేయించాడు, ఈ సినిమాకి మెగా ఫామిలీ మొత్తం మంచిగా ప్రొమోషన్స్ చెయ్యడం మన అందరం గమనించాము,మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ చిరంజీవి అల్లుడు అనే కారణం చేత కళ్యాణ్ దేవ్ కి ఆ సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు, వాటిల్లో ఆయన హీరో గా నటించిన సూపర్ మచ్చి సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి దారుణ పరాజయం పాలైంది, ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు,ఇక ఈ సినిమాతో పాటు ఆయన హీరోగా కిన్నెరసాని అనే సినిమా కూడా చేసాడు, ఇది కూడా విడుదలకి సిద్ధం గా ఉన్నది, ఈ సినిమాతో పాటుగా మరో రెండు పెద్ద ప్రొడక్షన్స్ లో హీరో గా మొదటి సినిమా తర్వాతే బుక్ అయ్యాడు కళ్యాణ్ దేవ్, చిరంజీవి కుటుంబానికి సంబంధించిన మనిషి అంటే సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి అవకాశాలు వస్తాయో అని చెప్పడానికి ఇది ఒక్క నిదర్శనం అని చెప్పొచ్చు, అయితే ఇప్పుడు చిరంజీవి కుటుంబం తో సంబంధాలు కట్ అయినా తర్వాత కూడా కళ్యాణ్ దేవ్ కి అవకాశాలు వస్తాయా?,ఉదయకిరణ్ ని తొక్కినట్టు చిరంజీవి కళ్యాణ్ దేవ్ ని కూడా తొక్కేస్తాడు అని పచ్చ మీడియా ఇప్పటికే అసత్యపు ప్రచారాలను మొదలెట్టేసింది.

ఎంత పెద్ద హీరో అయినా కూడా వరుసగా నాలుగు ఫ్లాప్స్ పడితే కెరీర్ డౌన్ అవ్వడం సర్వసాధారణం, అటు ఉదయ్ కిరణ్ అయినా కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయన కానీ డౌన్ ఫాల్ చూడాల్సిందే, కెరీర్ ప్రారంభం లో తారాజువ్వ ఎగిరి శిఖరాలను అధిరోహించిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ వచ్చేలోపు కెరీర్ పరంగా బాగా డౌన్ అయ్యి సినిమా అవకాశాలను మెల్లిగా పోగొట్టుకుంటూ వచ్చాడు, కానీ దీనిని ఉదయకిరణ్ తన కూతురితో పెళ్లి క్యాన్సిల్ చేసాడు అనే అక్కసు తో చిరంజీవి కావాలని ఉదయకిరణ్ ని తొక్కే ప్రయత్నం చేసాడు అని పచ్చ మీడియా చిరంజీవి పై విష ప్రచారాలు చేసింది, చిరంజీవి కూతురితో పెళ్లి క్యాన్సిల్ అయినా తర్వాత కూడా ఉదయ్ కిరణ్ దాదాపుగా 12 సినిమాలకు పైగానే చేసాడు, అందులో ఒక్కటి రెండు హిట్ అయ్యాయి కూడా, ఉదయకిరణ్ ని నిజంగా చిరంజీవి తొక్కాలని చూస్తే ఇన్ని సినిమాల్లో నటించే అవకాశం ఎలా లభిస్తుంది, స్వయంగా ఉదయకిరణ్ అక్కగారు కూడా చిరంజీవి గారు ఉదయకిరణ్ కి ఎంతో సహాయం చేసారు , ఆయన ఉదయ్ కి గాడ్ ఫాదర్ లాంటివాడు అని చెప్పిన కూడా ఈ విష ప్రచారాలకు అడ్డుకట్ట పడలేదు, పైగా ఇప్పుడు కళ్యాణ్ దేవ్ ని కూడా అలా తొక్కేస్తారు అంటూ విష ప్రచారం చేస్తున్నారు, ఈ విసహాయం పై కళ్యాణ్ దేవ్ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు అట, చిరంజీవి గారు తనకి తండ్రి లాంటి వాడు అని , ఆయన ఎప్పటికి తనకి ఆండగానే ఉంటాడు అని చెప్పుకొచ్చాడు అట, ఒక్క తండ్రి స్తానం లో మెగాస్టార్ నాకు అందించిన సహకారాలు నేను ఎప్పటికి మర్చిపోను అని , ఇప్పటికి కూడా నాకు సినిమాల ఎంపిక విషయం లోక్ చిరంజీవి గారు సలహాలు ఇస్తూనే ఉన్నారు అని, దయచేసి తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించవద్దు అని కళ్యాణ్ దేవ్ ఈ సందర్భంగా అన్నాడట.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…