Home Entertainment శోభిత దూళిపాళ్ల తో ప్రేమ వ్యవహారం గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

శోభిత దూళిపాళ్ల తో ప్రేమ వ్యవహారం గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

0 second read
0
0
667

అక్కినేని నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన నాగచైతన్య తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ని ఏర్పరచుకున్నాడు..ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు..నాగ చైతన్య సినిమా అంటే మినిమం గ్యారంటీ గా ఉంటుంది..కచ్చితంగా థియేటర్స్ లో చూడాలి అనేంత ఉత్సాహం ప్రేక్షుకులలో ఏర్పడిన విషయం వాస్తవం..ఇటీవల కాలం లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి కెరీర్ పరంగా మంచి ఊపు మీద వెళ్తున్న నాగ చైతన్య కి ఇటీవలే విడుదలైన ‘థాంక్యూ’ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది..అక్కినేని ఫామిలీ కి మనం వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్, థాంక్యూ సినిమా ద్వారా అక్కినేని కుటుంబం కి ఒక మాయని మచ్చ ఇచ్చాడు అనే చెప్పాలి..కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకొని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..ఇంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ నాగ చైతన్య కెరీర్ లో లేదనే చెప్పాలి..అలాంటి ఫ్లాప్ తర్వాత నాగ చైతన్య ముఖ్య పాత్ర పోషించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఆగస్టు 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల కానుంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ హీరో గా నటించిన ఈ సినిమాకి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు..ఈ సినిమా ప్రొమోషన్స్ లో కూడా నాగ చైతన్య మరియు అమిర్ ఖాన్ తో కలిసి చిరంజీవి చురుగ్గా పాల్గొంటున్నాడు..అంతే కాకుండా నాగ చైతన్య కూడా ప్రత్యేకంగా ఇంటర్వూస్ ఇస్తున్నాడు..అయితే సమంత తో విడాకులు జరిగిన తర్వాత నాగ చైతన్య ఒక్కసారి కూడా విడాకులు గురించి ఎలాంటి కామెంట్ చెయ్యలేదు..అయితే ఇటీవల బాలీవుడ్ కి సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సమంత గురించి మరియు ప్రేమ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘సమంత తో విడిపోయినప్పటికీ కూడా తను అంటే నాకు ఎంతో గౌరవం ఉంది..మా ఇద్దరి మధ్య కొన్ని విషయాలు కుదరక విడిపోయాము కానీ..సమంత అంటే నాకు ఒక ఫ్రెండ్ ఇప్పటికి ఇష్టమే’ అంటూ నాగ చైతన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక ఇప్పుడు మీకు విడాకులు అయ్యింది కదా మళ్ళీ ప్రేమలో పడే ఛాన్స్ ఉందా అని యాంకర్ అడిగిన ప్రశ్న కి నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘ప్రేమలో పడడం తప్పు కాదు కదా..గాలి నీరు నిప్పు నెల ఇలా పంచభూతాలు ఎలా అయితే శాశ్వతమో..మన జీవితాల్లో వీటిని ఎలా అయితే తప్పించుకోలేమో..ప్రేమ కూడా అంతే..అది ఒక అద్భుతం..ప్రేమించడం ఎంత గొప్పో..ప్రేమించబడడం కూడా అంతే గొప్ప’అంటూ నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..నాగ చైతన్య గత కొంతకాలం నుండి ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో డేటింగ్ లో ఉంటున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్క సోషల్ మీడియా లో మాత్రమే కాదు..దీని గురించి నేషనల్ మీడియా కూడా ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి..మరి నాగ చైతన్య ప్రేమ గురించి ఇంత గొప్పగా మాట్లాడడం తో మీడియా లో వచ్చిన ఆ వార్తలు నిజమేనా అనే సందేహాలు అభిమానులలో నెలకొన్నాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై…