
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మూలస్తంభాలుగా నిలిచినా మహానటులలో ఒకరు రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు..ఎన్టీఆర్ మరియు ANR వంటి సూపర్ స్టార్స్ తరవాత కృష్ణ , కృష్ణంరాజు మరియు శోభన్ బాబు యుగం అప్పట్లో ఏ స్థాయిలో నదించిందో మన అందరికి తెలిసిందే..తెలుగు సినీ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసాడు కృష్ణంరాజు గారు..అలాంటి మహానటుడు ఈరోజు తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాలకు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించడం యావత్తు సినీ లోకాన్ని దుఃఖసాగరంలోకి నెట్టేసింది..నటుడిగా మరియు రాజకీయ నాయకుడుగా ఈ మహానుభావుడు సినీ పరిశ్రమకి మరియు ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం..తన తోటి వారితో ఎల్లప్పుడూ నవ్వుతు పలకరిస్తూ ఎంతో ఆప్యాయంగా వ్యవహరించే కృష్ణం రాజు గారు ఈరోజు అలా విగతజీవిగా పడిఉండడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు..ఇక సూపర్ స్టార్ కృష్ణ గారితో కృష్ణం రాజు గారికి ఉన్న ఆత్మీయ అనుబంధం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరు కలిసి ఎన్నో సినిమాలలో నటించారు కూడా.
అంతే కాకుండా వ్యక్తిగతం గా కూడా కృష్ణ గారితో కృష్ణంరాజు ఎంతో సాన్నిహిత్యం ఉంది..కృష్ణం రాజు గారిని కృష్ణ గారు ఎప్పుడు తన సొంత సోదరుడిగా భావిస్తారు..అలాంటి మనిషి ఈరోజు కన్నుముయ్యడం తో కృష్ణ గారి బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది..నడవలేని స్థితి లో ఉన్నప్పటికీ కూడా తన సోదరుడు ని చూడడానికి ఈరోజు ఈరోజు కృష్ణ గారు తరలివచ్చారు..కృష్ణంరాజు గారి పార్థివ దేహాన్ని చూడగానే కన్నీరు మున్నీరు అయ్యారు కృష్ణ గారు..పక్కనే ఉన్న ప్రభాస్ కి ధైర్యం చెప్తూ ఆయనని కూడా ఓదార్చు కృష్ణ గారు..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది..ఇక అభిమానుల బాధ వర్ణనాతీతం..సినీ తారలందరూ ఒక చోట ఆనందకర సందర్భం లో చూడాలని కోరుకుంటారు అభిమానులు..కానీ ఇలా విషాద సమయం లో చూడాలని కోరుకోరు..కానీ ఆ సందర్భం దురదృష్టం కొద్దీ రానే వచ్చింది..సోషల్ మీడియా మొత్తం కృష్ణం రాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థన చేస్తున్న పోస్టులే దర్శనమిస్తున్నాయి.
కృష్ణంరాజు గారు కేవలం నటుడిగా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించాడు..ప్రభాస్ ని హీరో గా పెట్టి భారీ బడ్జెట్ తో ఆయన తెరకెక్కించిన రాధే శ్యామ్ సినిమా ఈ ఏడాది విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన వెండితెర మీద చివరిసారిగా కనిపించిన సినిమా కూడా ఇదే..ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృష్ణం రాజు గారు చలాకి గా సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పటికి మనకి గుర్తుంది..ఈమధ్య కాలం లో ఆయన అనేక ఇంటర్వూస్ కూడా ఇచ్చాడు..మధ్యలో కొన్ని సార్లు అస్వస్థతకి గురైనప్పటికీ కూడా త్వరగానే కోలుకొని ఆరోగ్యంగా మనకి కనిపించేవారు..కానీ ఈసారి దేవుడు శాశ్వతంగా ఆయనని మన మధ్య నుండి తీసుకెళ్లడం జీర్ణించుకోలేని విషయం..ఆయన పవిత్రమైన ఆత్మ ఎక్కడ ఉన్న శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా మన అందరం ప్రార్థన చేద్దాము.