
కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఇప్పుడు ఈమె తెలుగు టాప్ హీరోయిన్స్ లో ఒకరు. అయితే శృతి హాసన్ కమల్ హాసన్ కూతురు కాకుండా తన స్వయం కృషితో ఎదిగింది తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. శృతి హాసన్ మొదటి సినిమా లక్ ఈ సినిమా తనను నిరాశపరిచింది అనవచ్చు. శృతి హాసన్ కి 7th సేన్స్ సినిమా విజయం సాధించి గుర్తింపు తెచ్చింది శృతి హాసన్ కెరీర్ లో మొదటి హిట్ సినిమా గా 7th సేన్స్ నిలిచింది ఇప్పటి వరకు ఈమె 33 సినిమాల్లో నటించారు. ఇది ఇలా ఉండగా సాదరంగా హీరో, హీరోయిన్లు లేదా హీరోయిన్, డైరెక్టర్ కలిసి రెండు,మూడు సినిమాల్లో చేస్తే వారి గురించి వార్తలు చెక్కర్లు కొడుతుంటాయి వారి మధ్య గల సంబంధం గురించి మీడియా కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది.
అలాంటిది రీసెంట్ గా వీర సింహ రెడ్డి సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ఐ లవ్ యు శృతి అని చెప్పటం తో వీరిద్దరి పై కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లో వచ్చిన 3 సినిమాల్లో శృతి హాసన్ నటించటం ఆ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోవటం తో వీరి మధ్య సంబంధం గురించి ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అయితే వీరు వారిద్దరి మధ్య గల సంబంధం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అన్న చెల్లి బంధం ఉంది ఈ విషయాన్ని శృతి హాసన్ వేదిక పై చెప్పటం జరిగింది. నేను ఒక చెల్లి గా భావించి ఐ లవ్ యు చెప్పానని మీరు పుట్టిస్తున్న ఈ వార్తలను చూస్తుంటే నవ్వొస్తుంది అని గోపీచంద్ మలినేని సమాధానం ఇచ్చారు. అయితే బాలకృష్ణ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీర సింహ రెడ్డి హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.