
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో హీరో శర్వానంద్ ముందు వరుసలో ఉంటాడు..నీ పెళ్లి ఎప్పుడూ అంటే ‘ప్రభాస్ పెళ్లి జరిగిన వెంటనే చేసుకుంటాను’ అంటూ సమాధానం దాటవేసేవాడు..మొన్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో కి వచ్చినప్పుడు కూడా ఇదే పెళ్లి గురించి బాలయ్య అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పాడు శర్వా..అయితే న్యూ ఇయర్ రోజు అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అధికారిక ప్రకటన చేసాడు..పెళ్లి కూతురు హైదరాబాద్ కి చెందిన రెడ్డి సామజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి..ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా మామూలుది అయితే కాదు..పూర్తిస్థాయి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందట..ఆమె తాతయ్య మాజీ మంత్రి అట..వందల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయట..ఆ అమ్మాయి పేరు పద్మ..ఈ నెల 26 వ తారీఖున పార్క్ హయత్ లో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరగనుంది అట..దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ ఉంది.
అయితే ఈ ఆహ్వాన పత్రిక విలువ ఎంతో తెలిస్తే మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం..ఈ పత్రిక విలువ సుమారుగా నాలుగు లక్షల రూపాయిలు ఉంటుందట..ఈ ఆహ్వాన పత్రిక వేలతో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పెళ్లి కూడా చేసేసుకోవచ్చు..డబ్బు ఉన్నోళ్ల పెళ్లిళ్లు ఈ రేంజ్ లోనే జరుగుతాయి మరి..శర్వానంద్ కూడా సినిమాల్లోకి అడుగుపెట్టకముందే మంచి ధనవంతుడు..హైదరాబాద్ లో వీళ్ళకి ఎన్ని భూములు ఉన్నాయో వాళ్ళకే తెలియవట..అంత పెద్ద ధనవంతుడు శర్వానంద్..బంజారా హిల్స్ లో ఆయనకీ ఒక కాఫీ షాప్ కూడా ఉంది..అయితే ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా సింపుల్ గా ఉండడం శర్వానంద్ కి అలవాటు..తన తండ్రి ఇచ్చిన ఆస్తిని ముట్టుకోకుండా..తన సొంత సంపాదన తో బ్రతుకుతున్న వ్యక్తి ఆయన..ఈ విషయాన్నీ స్వయంగా శర్వానంద్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు.
ఇక హీరో గా కూడా శర్వానంద్ కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ రోల్స్ తోనే నెట్టుకొచ్చిన శర్వానంద్, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు..కానీ ఈమధ్య కాలం లో ఆయనకీ వరుసగా ఆరు ఫ్లాప్స్ పడ్డాయి..అలాంటి సమయం లో రీసెంట్ గా విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత ఆయన వెంటనే మరో సినిమాకి కమిట్ అవ్వలేదు..ఎందుకంటే కథ విషయంలో ఆచి తూచి అడుగులు వెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడు శర్వానంద్..చూడాలిమరి పెళ్లి తర్వాత శర్వానంద్ కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో అనేది.