
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎన్నారై అమ్మాయిని అతడు వివాహం చేసుకోబోతున్నాడు. అయితే ఆమె రెడ్డి సామాజికవర్గానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో నివసిస్తోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడంతో శర్వానంద్ ఆమెను చూసి ఇష్టపడ్డాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా అంగీకారం తెలపడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే శర్వానంద్ చేసుకోబోయే భార్యకు రాజకీయ నేపథ్యం కూడా ఉందని టాక్ నడుస్తోంది. ఆమె టీడీపీ సీనియర్ నేత మనవరాలు అని తెలుస్తోంది. ఆమెకు కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని టాక్. శర్వా కంటే ఆమె చాలా రిచ్ అని తెలుస్తోంది. మొత్తానికి రాజకీయ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలితో శర్వానంద్ నిశ్చితార్థం ఈనెల 26న జరగబోతోందని సమాచారం అందుతోంది. అయితే ఈ వేడుకను సింపుల్‌గా చేయాలని ఇరుకుటుంబాలు నిశ్చయించుకున్నాయి.
ఈ ఏడాది వేసవిలో హీరో శర్వానంద్ పెళ్లి జరిగే అవకాశం ఉంది. అతడిది ప్రేమ వివాహం అంటూ ముందు ప్రచారం జరిగింది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. అయితే పెళ్లి కుమార్తె ఎవరు.. ఆమె పేరేంటి.. అనే విషయాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. శర్వాకి కాబోయే మామగారికి సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శర్వానంద్ వయసు 38 ఏళ్లు. ఇప్పటికే పెళ్లి చేసుకోవడం లేట్ అయ్యిందని పలువురు హీరోలు శర్వాను టీజింగ్ చేస్తున్నారు. ఇటీవల బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోకు హాజరైన సమయంలోనూ పెళ్లి గురించి అడిగితే ప్రభాస్ చేసుకున్న తర్వాత చేసుకుంటానని సమాధానం ఇచ్చాడు. ఇదే విషయాన్ని ప్రభాస్‌ను అడగ్గా తాను సల్మాన్ చేసుకున్నప్పుడు చేసుకుంటానని ఛమత్కరించాడు. శర్వానంద్ విషయానికొస్తే అతడు 2003లో విడుదలైన ఐదో తారీఖు అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో థమ్స్ అప్ యాడ్‌లో నటించడమే కాకుండా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు.
చిరుతో నటించిన శంకర్‌దాదా సినిమా శర్వానంద్ కెరీర్లో భారీ మలుపు అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అతడికి టాలీవుడ్లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. వెంకటేష్‌తో సంక్రాంతి సినిమాలో చిన్న తమ్ముడిగా నటించాడు. అంతేకాకుండా లక్ష్మీ అనే చిత్రంలోనూ తమ్ముడి క్యారెక్టర్ పోషించాడు. ఆ తర్వాత అల్లరి నరేష్‌తో కలిసి చేసిన గమ్యం మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తాను ప్రేమించిన కమలినీ ముఖర్జీ కోసం బైకుపై నరేష్‌తో కలిసి జర్నీ చేస్తాడు. ఈ జర్నీలో అతడికి ఎదురైన అనుభవాలతో మంచి మనిషిగా మారిపోతాడు. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాకు ముందు శర్వానంద్ వెన్నెల సినిమాలో సైకో క్యారెక్టర్లో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, శతంమానం భవతి చిత్రాలు శర్వాకు మంచి హిట్లను అందించాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు తర్వాత సరైన సక్సెస్‌లేని శర్వానంద్ ఎట్టకేలకు గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు.