
టాలీవుడ్ వరుసగా ప్రముఖ నటులను కోల్పోతోంది. కృష్ణంరాజు మరణించి మూడు నెలలు కూడా గడవక ముందే సూపర్‌స్టార్ కృష్ణ కూడా ప్రేక్షకులకు దూరమయ్యారు. అనారోగ్య సమస్యలతో ఆయన నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున మరణించారు. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. తొలి తెలుగు కలర్ చిత్రం సాంఘికం, తొలి జేమ్స్‌బాండ్, కౌబాయ్, సినిమాస్కోప్, 70 ఎంఎం, డీటీఎస్ మూవీ సహా తెలుగు చిత్ర సీమకు ఎన్నో కొత్త టెక్నాలజీలను ఆయన పరిచయం చేశారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు ఎంతోమంది టెక్నియషిన్స్‌ను పరిచయం ఘనత ఈ ఘట్టమనేని హీరోకే దక్కుతుంది. ప్రొఫెషనల్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం నిజంగా తీరని లోటే అని చెప్పాలి మహేష్ బాబు కూడా చాల మంచి గొప్ప నటుడు ఆయన చేసిన సినిమాలు కూడా సూపర్ కృష్ణ ను ఎంతగానో ఆనంద పరిచాయి ఆయన మహేష్ సినిమాలు చూసి ఎంజాయ్ చేసారు మహేష్ ని ఒక పాత్రలో చూడాలని ఆయన కోరుకున్నాడు మహేష్ కుమార్త్ అంటే కృష్ణ గారికి ఎంతో ఇష్టం మహేష్ కోసం కెఇస్న గారు కొన్ని కండిషన్లతో పెంచారని ఎన్నో సార్లు ఆయన ఇంటర్ వ్యూ లలో చెప్పడం జరిగింది ఆయన సినిమా ప్రపంచం లో ఎన్నో ఒడిదుడుకులు చేసారు అని చెప్పచ్చు.
సినిమాల్లో నటించే రోజుల్లోనే ఎవరైనా ఆపదలో ఉంటే సూపర్ స్టార్ కృష్ణ మంచి మనసుతో ఆదుకునేవాళ్లు. బతికినన్ని రోజులు నలుగురి మంచి కోరుకుంటూ ఆయన ముందుకు సాగిపోయేవారు. ఇలా ఎన్నో మహోన్నత కార్యక్రమాలను ఆయన చేపట్టి ప్రేక్షకుల చేత జేజేలు అందుకున్నారు. తాజా ఆయన గొప్పతనం మరోసారి బయటపడింది. మరణించిన తర్వాత కూడా తన అవయవాలు వేరేవాళ్లకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కృష్ణ తన అవయవాలను దానం చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఆయన బతికి ఉన్నప్పుడే తన అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆయన చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని ఆయన శరీరంలోని కొన్ని అవయవాలను వైద్యులు సేకరించారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఎలాగైతే ఆపదలో ఉండేవాళ్లను ఆదుకుని తన గొప్పతనాన్ని చాటుకున్నారో ఆయన తనయుడు హీరో మహేష్‌బాబు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. కృష్ణలోని గొప్ప గుణమే ఆయన తనయుడు మహేష్ బాబుకి కూడా వచ్చింది. మహేష్ ఎప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా ముందుకు సాగుతున్నారని మనకు తెలిసిన విశ్యమే అంతే కాదు ఆయన సినిమాలో ఎన్నో డిపార్టెన్స్ కూడా చేసారు అనిచెప్పచ్చు కృష్ణ గారు మనకు చెప్పిన అన్ని కూడా ఆయన సినిమా లోకి వచ్చిన తరవాతే కానీ ఆయన సినిమాలోకి రక ముందు పడిన అన్ని కష్టాలు ఎవరికి షేర్ చేయలేదు అని చెప్పాలి.
అందులో భాగంగానే మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వాళ్ళ పాలిట దేవుడిలా మారాడు.మహేష్ ఇలాంటి పనులు చెయ్యడానికి తండ్రి కృష్ణ ప్రభావం బలంగానే ఉంది. టాలీవుడ్‌లో మరే హీరో చేయలేని విధంగా మహేష్ ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను నిలబెడుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ సాయంతో ఆపరేషన్‌లు చేయిస్తున్నాడు. ఇటీవల తన తండ్రి చనిపోయిన రోజే మరో చిన్నారికి కూడా పునర్జన్మ అందజేశాడు. మోక్షిత సాయి అనే చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణం నిలబెట్టారు.మోక్షిత సాయి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ అయి గుండె ఆపరేషన్ చేయించాలని మహేష్ బాబు సహాయం కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన తండ్రి విషయంలో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ చిన్నారి ఆపరేషన్‌కు కావాలసిన ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా ఇప్పటివరకు 1100 మంది చిన్నారులకు పైగా మహేష్ గుండె ఆపరేషన్‌లు చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.