
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఏ విధంగా ఎలా మారుతుందో ఎవ్వరు ఊహించలేకపొతున్నారు..నేడు విశాఖపట్నం లో వైసీపీ పార్టీ చేపట్టిన ఉత్తరాంధ్ర గర్జన కార్యక్రమం రోజే పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ కొనసాగింది..అనుకున్నట్టు గానే ఈ టూర్ లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి..ఉత్తరాంధ్ర కి పవన్ కళ్యాణ్ ఎలా అడుగుపెడుతాడో మేము కూడా చూస్తాం ఖబర్దార్ అంటూ వైసీపీ పార్టీ నాయకలు సవాలు విసిరారు..దమ్ముంటే పవన్ కళ్యాణ్ ని ముట్టుకునే సాహసం చెయ్యండి..ఆ తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వైసీపీ నాయకులకు హెచ్చరికలు చేసారు..నేడు సవాలు విసిరినా మంత్రులు గర్జ కార్యక్రమానికి వెళ్లడం కోసం విశాఖపట్నం విమానాశ్రయం ని దాటుకొని వెళ్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడిని తట్టుకోలేకపోయారు..అదే సమయమున పవన్ కళ్యాణ్ వైజాగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అని తెలియడం తో అక్కడకి అభిమానులు వేల సంఖ్యలో వచ్చేసారు..వాళ్ళని దాటుకొని వెళ్లడం వైసీపీ మంత్రులకు అగ్ని పరీక్షా లాగ మారింది.
దొరికిన వారిని దొరికానట్టు దంచి కొట్టేసారు..కార్లు పై కర్రలతో మరియు రాళ్లతో దాడి చేసారు..ఇక వైసీపీ మంత్రి జోగి రమేష్ ఈ దాడి పై స్పందించి ‘కర్రలతో రాళ్లతో మాపై దాడి చేసారు..పవన్ కళ్యాణ్ అభిమానులు క్రమశిక్షణ లేని వారు..మా సిబ్బందికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి..కారు అద్దాలు కూడా పగిలిపోయాయి’ అంటూ ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి చెప్పారు జోగి రమేష్..ఇక మంత్రి రోజా గారి పైన కూడా ఒక అభిమాని తన చేతిలో ఉన్న హెల్మెట్ ని విసిరాడట..ఈ వార్త కూడా సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనదైన శైలిలో స్పందించారు..ఒక బాధ్యతగల పదవి లో ఉంది కుర్రాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడడం ఎందుకు..ఆ తర్వాత వాళ్ళ ఆగ్రహావేశాలకు బలవ్వడం ఎందుకు..అయినా ఆ దాడి మేమె చేసాము అన్న గ్యారంటీ ఏమిటి..గతం లో జగన్ గారు ఇలాంటి నాటకాలు చాలానే ఆడాడు..ఆయనే ఈ దాడి చేయించి జనసేన పార్టీ పర్యటనకి ఆటకం కలిగించేలా చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ ఫాన్స్ మరియు జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన మూడు రోజుల వరుకు కొనసాగుతుంది..ఈ పర్యటన ద్వారా జనవాణి కార్యక్రమం ని నిర్వహించి ఉత్తరాంధ్ర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రానున్నారు..అయితే ఈ మూడు రోజులు రాష్ట్రం రాజకీయ పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉండనున్నాయి అని రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ..అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ గతం లో జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక వీడియో ని తెగ వైరల్ చేస్తున్నారు..గతం లో తెలుగు దేశం పార్టీ ఆఫీస్ పై వైసీపీ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ దాడి పై ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ‘ఒక హోదా లో ఉన్నప్పుడు ముందు వెనక చూసుకొని మాట్లాడాలి..అడ్డమైన బూతులు మాట్లాడితే వారిని అభిమానించే అభిమానులు కంట్రోల్ తప్పిపోయి దాడులు చేసే అవకాశం ఉంది..మేము ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి బూతులు ఎప్పుడూ మాట్లాడింది లేదు’అంటూ చెప్పుకొచ్చాడు జగన్..ఆ వీడియో ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాన్స్ వైరల్ చేస్తున్నారు..ఇదే మాటలు వైసీపీ నాయకులకు కూడా వర్తిస్తుందని..పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా వ్యక్తిగత విమర్శలు ఎవ్వరి మీద చెయ్యలేదని..పాలసీ మీద మాత్రం ఆయన మాట్లాడాడని..కానీ వైసీపీ నాయకులూ ప్రతిసారి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగానే విమర్శిస్తారని..అలా విమర్శిస్తూ పోతే కచ్చితంగా ఎదో ఒక రోజు ఇలాంటి గతే పడుతుందని చెప్పుకొస్తున్నారు..మరి ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరుకు ఆగాల్సిందే.