Home Entertainment వైసీపీ పార్టీ కి రాజీనామా చెయ్యబోతున్న రోజా..ప్రకంపనలు రేపుతున్న వాట్సాప్ ఆడియో మెసేజ్

వైసీపీ పార్టీ కి రాజీనామా చెయ్యబోతున్న రోజా..ప్రకంపనలు రేపుతున్న వాట్సాప్ ఆడియో మెసేజ్

0 second read
0
0
722

ఏపీలో అధికార పార్టీ వైసీపీలో మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మీడియా ముందుకు వస్తే ప్రతిపక్షాలను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటారు. అందుకే ఆమెకు సీఎం జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేక వర్గం తయారైంది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రోజా ఎమ్మెల్యేగా గెలవగా.. అదే నియోజకవర్గం నుంచే రోజా అసమ్మతి సెగ తగులుతోంది. నిండ్ర మండలం కొప్పెడులో రైతు భరోసా కేంద్రానికి మంత్రి రోజా వ్యతిరేకవర్గం సోమవారం నాడు భూమిపూజ చేయడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి హాజరయ్యారు. అయితే ఈ విషయంపై మంత్రి రోజా సీరియస్ అయ్యారు. తనను సంప్రదించకుండా తన నియోజకవర్గంలో భూమిపూజ చేయడంపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా తన అసమ్మతి వర్గం భూమిపూజ చేయడాన్ని నిరసిస్తూ వాట్సాప్ గ్రూపులో మంత్రి రోజా ఆడియో విడుదల చేశారు. పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పని చేస్తున్నామని.. ఇలాంటి కార్యక్రమాలతో పార్టీకి, తనకు నష్టం కలిగించొద్దని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేతలను ప్రోత్సహించడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఇలా అయితే రాజకీయాలు చేయడం కష్టమని రోజా అన్నారు. నియోజకవర్గంలో తనను వీక్ చేసే విధంగా వ్యతిరేక వర్గం పని చేస్తోందని ఆమె ఫైర్ అయ్యారు. తెలుగుదేశం, జనసేన వాళ్లు నవ్వుకునే విధంగా, ఆ పార్టీలకు సపోర్ట్ చేస్తూ తనతో పాటు పార్టీకి నష్టం జరిగే విధంగా, పార్టీ పరువును దిగజారుస్తూ వీళ్లు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మంత్రి రోజా ప్రశ్నించారు. దీనిపై వాళ్లు ఆలోచన చేస్తే మంచిదని హితవు పలికారు. ఒకవైపు పార్టీకి నష్టం జరుగుతుంటే.. వీళ్లు పార్టీ నాయకులు అని చెప్పి ప్రోత్సహించడం కూడా తనకు బాధేస్తోందని రోజా వాపోయారు.

నగరి నియోజకవర్గంలో వైసీపీలో కొంతమంది నేతలకు, రోజాకు కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేధాలున్నాయి. రోజాకు వ్యతిరేకంగా కొంతకాలంగా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారు. వారిపై రోజా ఎప్పటికప్పుడు అసహనం వ్యక్తం చేస్తునే ఉంటారు. అయితే నగరి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో వైసీపీలోని ప్రత్యర్థి వర్గం తనకు వ్యతిరేకంగా పని చేస్తోందని మంత్రి రోజా ఆరోపిస్తున్నారు. మరోవైపు మంత్రి రోజానే తమను ఇబ్బంది పెట్టారని, అందువల్లే తాము వేరు కుంపటి పెట్టుకున్నామని ప్రత్యర్థి వర్గం నేతలు అంటున్నారు. అటు ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం రివ్యూ మీటింగ్‌లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పనితీరు సరిగ్గా లేదని సీఎం జగన్ ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో మంత్రి రోజా పేరు కూడా ఉందనే ప్రచారం బయటకు రావడంతో నగరిలో ఆమె మళ్లీ ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు నడుస్తున్నాయి. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి మంత్రి రోజా రాజకీయాలకు గుడ్‌బై చెప్తారనే వదంతులు కూడా వ్యాప్తి చెందుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…