
ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్ అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో ఆయనకీ మళ్ళీ ఊపిరి పోసిన చిత్రం అఖండ..బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే ఈ చిత్రం దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..బాలయ్య బాబు కి అంత వసూళ్లు వస్తాయని బహుశా నందమూరి ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు..ఈ సినిమా విడుదలై నిన్నటికి సరిగ్గా ఏడాది అయ్యింది..ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేని తో ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..బాలయ్య బాబు ని అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఫ్యాక్షనిస్టు పాత్రలో చాలా ఏళ్ళ తర్వాత కనిపిస్తుండడం తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ‘జై బాలయ్య’ సాంగ్ విడుదల చెయ్యగా అభిమానుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..ఇక ఆ తర్వాత ఈ సినిమా విడుదల తేదీ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు..వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఈరోజు మధ్యాహ్నం జనవరి 12 వ తేదీన ఈ సినిమాని విడుదల చెయ్యబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..ఈ సందర్భంగా వాళ్ళు ఈ చిత్రం లో బాలయ్య బాబు కి సంబంధించిన ఒక పవర్ ఫుల్ పోస్టర్ ని విడుదల చేసారు..అది సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది..అంతే కాకుండా అతి త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన బ్రాండ్ న్యూ టీజర్ ని విడుదల చేయబోతున్నారట..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉంది..బాలయ్య బాబు ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఈ సినిమా అఖండ ని మించి ఉండబోతుందట.
ఇక ఈ సినిమా తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కూడా విడుదల కాబోతుంది..రెండు సినిమాలకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం..వాల్తేరు వీరయ్య చిత్రాన్ని జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నారట..ఇలా ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి రెండు పెద్ద సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో విడుదల కావడం చరిత్ర లో ఇదే తొలిసారి..పైగా చిరంజీవి – బాలయ్య మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే..గతం సంక్రాంతికి వీళ్లిద్దరి సినిమాలు చాలానే పోటీ పడ్డాయి..కొన్ని సార్లు బాలయ్య బాబు ఆ పోటీలో గెలిస్తే మరికొన్ని సార్లు చిరంజీవి పోటీ లో గెలుపొందాడు..వీళ్లిద్దరి సినిమాలు చివరి సారిగా తలపడింది 2017 వ సంవత్సరం లో..బాలయ్య బాబు గౌతమీ పుత్ర శాతకర్ణి తో ప్రేక్షకుల ముందుకి రాగా..చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో వచ్చాడు..ఈ రెండు సినిమాలలో చిరంజీవి సినిమా భారీ మార్జిన్ తో బాలయ్య బాబు మీద పై చెయ్యి సాధించింది..మరి ఈసారి పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.