
నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఇటీవలే విడుదలై యావరేజి టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి..అఖండ వంటి సెన్సేషన్ తర్వాత బాలయ్య నుండి వస్తున్న చిత్రం కావడం, దానికి తోడు ‘అన్ స్టాపబుల్ ‘ షో ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కడం ఈ ఓపెనింగ్స్ కి కారణం అని చెప్పొచ్చు..అయితే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కి రెండవ రోజు వచ్చిన కలెక్షన్స్ కి అసలు పొంతనే లేదు..మొదటి రోజు ఏకంగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.,ట్రేడ్ పండితులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది..ఎందుకంటే ‘అఖండ’ సినిమాకి ముందు బాలయ్య కి ఫుల్ రన్ లో కూడా అంత వసూళ్లు వచ్చేవి కాదు..అలాంటిది మొదటి రోజే ఆ రేంజ్ వసూళ్లు వచ్చేలోపు అసలు ఇది బాలయ్య సినిమానేనా అనే సందేహం అందరిలో మెలిగింది.
కానీ రెండవ రోజు ‘వాల్తేరు వీరయ్య’ దెబ్బకి ‘వీరసింహా రెడ్డి’ కోమాలోకి వెళ్లిపోయాడని చెప్తున్నారు ట్రేడ్ పండితులు..కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని కూడా ఈ చిత్రం రెండవ రోజు రాబట్టలేకపోయింది..బాలయ్య కి సూపర్ హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ వస్తాయి కానీ,మిగిలిన ఏ టాక్ వచ్చిన సాధారణ జనాలు చూడరని ఈ సినిమాతో తేలిపోయింది..రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా కేవలం మూడు కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..అది కూడా చాలా చోట్ల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి టికెట్స్ దొరకకపోవడం వల్ల వచ్చిన హెవీ రిటర్న్స్ అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..రెండవ రోజు ఈ స్థాయి వసూళ్లు వచ్చేసరికి ‘వీర సింహా రెడ్డి’ కి కేటాయించిన థియేటర్స్ అన్నీ ‘వాల్తేరు వీరయ్య’ కి కేటాయించారు.
ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 75 కోట్ల రూపాయిల దాకా జరిగింది..ఇప్పుడు బ్రేక్ అవ్వడం చాలా కష్టం అని అంటున్నారు ట్రేడ్ పండితులు..అదే కనుక జరిగితే నందమూరి అభిమానులు తీవ్రంగా నిరాశ పడాల్సి వచ్చేది..ఈరోజు రేపు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అసలు ఏ మాత్రం బాగాలేవు..ఈ సీజన్ మొత్తం ‘వాల్తేరు వీరయ్య’ కి టికెట్స్ దొరకని వాళ్ళు వీర సింహా రెడ్డి కి వెళ్లాల్సిన పరిస్థితే కనిపిస్తుంది..చూడాలి మరి పండగ సీజన్ అడ్వాంటేజ్ తో ఈ చిత్రం కనీసం యావరేజి స్టేటస్ కి అయినా చేరుతుందా లేదా అనేది.