Home Entertainment ‘వీర సింహా రెడ్డి’ మొదటి రోజు వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం..అల్ టైం రికార్డు

‘వీర సింహా రెడ్డి’ మొదటి రోజు వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం..అల్ టైం రికార్డు

1 second read
0
0
1,842

నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజి టాక్ ని తెచ్చుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడం తో ఆకాశాన్ని తాకినా అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా విఫలం అయ్యింది..కానీ ఓపెనింగ్స్ మాత్రం పగిలిపోయాయి..ముఖ్యంగా మాస్ ప్రాంతాలలో ఈ బాలయ్య దంచిన దంచుడు మామూలు రేంజ్ కాదు..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో థియేటర్స్ మొత్తం కిక్కిరిసిపొయ్యేలా చేసాడు బాలయ్య..తన కెరీర్ లో ఇలాంటి ఓపెనింగ్ ని చూస్తాను అని కనీసం బాలయ్య బాబు కూడా ఊహించి ఉండదు..ఆ రేంజ్ ఓపెనింగ్ ని ఈ సినిమా దక్కించుకుంది..ముఖ్యంగా సీడెడ్ ప్రాంతం లో అయితే బాహుబలి 2 ఓపెనింగ్స్ ని కూడా ఎగరేసికొట్టి నాన్ #RRR రికార్డు గా నిలిచింది ఈ చిత్రం..అలాంటి ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఆంధ్ర ప్రదేశ్ లో బాలయ్య సినిమాకి టాక్ వస్తే బాగా ఆడుతుంది అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..కానీ తెలంగాణ ప్రాంతం లో బాలయ్య సినిమాకి కళ్ళు చెదిరిపొయ్యే రేంజ్ ఓపెనింగ్ మాత్రం ఎప్పుడు చూడలేదు..ఇదే మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నేటి తరం స్టార్ హీరోలతో సరిసమానమైన ఓపెనింగ్ ని దక్కించుకోవడం అనేది నిజంగా ట్రేడ్ వర్గాలకు కూడా పెద్ద షాక్..కేవలం నైజాం ప్రాంతం నుండే ఈ సినిమాకి మొదటి రోజు 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించిందని అంచనా వేస్తున్నారు..ఇక సీడెడ్ లో కూడా అదే రేంజ్ షేర్ ని రాబట్టి నాన్ #RRR రికార్డు గా నిలిచిందని అంటున్నారు ట్రేడ్ పండితులు..అలా కేవలం నైజాం మరియు సీడెడ్ నుండే ఈ సినిమాకి 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అని ఒకప్పుడు బాలయ్య బాబు క్లోసింగ్ షేర్ కూడా అంత ఉండేది కాదని..ఇప్పుడు కేవలం మొదటిరోజే ఆ వసూళ్లను రాబట్టడం ఆశ్చర్యార్ధకం అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఇక బాలయ్య బాబు కి బాగా వీక్ జోన్ గా ఉండే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం పవర్ ప్లే బ్యాటింగ్ చేసినట్టు సమాచారం..మొదటి రోజు ఈ చిత్రం అక్కడ స్టార్ హీరో మూవీ రేంజ్ లో 7 లక్షల డాలర్లు వసూలు చేసింది..ఇది నిజంగా పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి..మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి ఈ సినిమా 20 కోట్ల రూపాయలకి పైగా షేర్ వసూళ్లు..ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది అంచనా వేస్తున్నారు..అయితే సినిమాకి పబ్లిక్ లో పెద్దగా టాక్ లేకపోవడం, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో ముందు బాలయ్య సినిమా నిలబడలేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట..చూడాలిమరి ఈ సినిమా రేంజ్ ఎంత వరకు వెళ్లి ఆగుతుందో అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…