
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదలైంది. ఏపీ, తెలంగాణలో దాదాపుగా అన్ని థియేటర్లలో వీరసింహారెడ్డి మూవీని విడుదల చేయడం జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. ఇప్పటికే ట్రైలర్, పాటలు మాస్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన తొలిసారిగా శ్రుతిహాసన్ నటించింది. వీళ్లిద్దరి పెయిర్ కూడా తెరపై చూడముచ్చటగా ఉంది. విలన్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఇరగదీసింది. లేడీ విలన్లకు తానేమీ తీసిపోను అన్నరీతిలో ఆమె నటించింది. అటు అఖండ సినిమా తర్వాత బాలయ్యకు సంగీత దర్శకుడు తమన్ మరోసారి అందించిన పాటలు, బీజీఎం వీరసింహారెడ్డి సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.
గోపీచంద్ మలినేని సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. దీంతో వీరసింహారెడ్డి కూడా ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటుందని తొలి నుంచీ ప్రచారం జరిగింది. అయితే ఈ మూవీ కథ రొటీన్‌గానే ఉంది. కానీ ఎలివేషన్స్ బాలయ్య అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో తొలి 20 నిమిషాలు హై ఇచ్చే సన్నివేశాలు ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌ను భారీగా చిత్రీకరించారు. ఇవి హెవీగా ఉండటం వల్ల వీరసింహారెడ్డి క్లాస్ ప్రేక్షకులకు మింగుడుపడదు. సెకండాఫ్‌లో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉన్నాయి. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాట సెకండాఫ్‌కు హైలెట్‌గా నిలిచింది. బాలయ్య డైలాగులు పటాసుల్లా పేలాయి. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి కొన్ని డైలాగులు ఉన్నాయి. మొత్తంగా కేవలం ఒక్కసారి మాత్రమే వీరసింహారెడ్డి సినిమా చూడొచ్చు అనే విధంగా ఉంది. ఈనెల 13న చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ పోటీగా ఉండటం వల్ల సంక్రాంతి సెలవుల తర్వాత వీరసింహారెడ్డి వసూళ్లు ఎలా ఉంటాయన్న విషయం ఆసక్తికరంగా మారింది.
హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో కూడిన వీరసింహారెడ్డి ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ను గమనిస్తే తెలంగాణలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 5.2 కోట్లు.. పశ్చిమ గోదావరిలో రూ. 5 కోట్లు, గుంటూరులో రూ. 6.40 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5 కోట్లు, నెల్లూరులో రూ. 2.7 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 61.30 కోట్ల బిజినెస్ చేయగా కర్ణాటకలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. కోటి, ఓవర్సీస్లో రూ. 6.2 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 74 కోట్ల షేర్ రాబట్టాలి. సంక్రాంతి సెలవులు, తొలిరోజు సోలో రిలీజ్ ఉండటంతో బాలయ్య సినిమాకు కలిసొచ్చే అంశమని చెప్పాలి.