
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ , అలాగే నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు ఒక్క రోజు తేడా తో ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..ఈ సంక్రాంతి వార్ మొత్తం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వైపు కి మారిపోయింది..ఇది అందరూ ఊహించిందే..చిరంజీవి మార్కెట్ ముందు బాలయ్య మార్కెట్ చాలా చిన్నది అనే విషయం ట్రేడ్ లో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు..కానీ అఖండ సక్సెస్ బాలయ్య రేంజ్ ని మార్చేసింది..ఆ సినిమాకి ముందు కనీసం స్థిరమైన 30 కోట్ల రూపాయిల మార్కెట్ కూడా లేని బాలయ్య కి ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో 75 కోట్ల రేంజ్ బిజినెస్ ని తెచ్చిపెట్టింది..కేవలం అఖండ మాత్రమే కాదు ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ టాక్ షో కూడా బాలయ్య కెరీర్ ని మార్చేసింది..యూత్ లో మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది.
అలా బాలయ్య బాబు ఎన్నడూ చూడని రేంజ్ పీక్ కెరీర్ ని చూస్తున్నాడు..మరో పక్క మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మరియు గాడ్ ఫాదర్ వంటి ఫ్లాప్ సినిమాలతో కెరీర్ లోనే పెద్ద స్లంప్ ఫేస్ లో ఉన్నాడు..అలాంటి సమయం లో అసలు బాలయ్య తో పోటీ ఇప్పుడు చిరు కి అవసరమా..ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు చిరంజీవి మీద బాలయ్య లీడ్ తీసుకుంటాడని అందరూ అనుకున్నారు..కానీ కథ అడ్డం తిరిగింది..అఖండ మరియు ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ద్వారా బాలయ్య కి వచ్చిన క్రేజ్ కె వేలం ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి ఓపెనింగ్స్ ని తీసుకొని రావడం వరకే ఉపయోగపడింది..ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బాలయ్య కి బదిత పూజ తప్పలేదు..కనీసం బాలయ్య పోటీ ఇచ్చినా బాగుండేది..కానీ అది కూడా జరగలేదు..కేవలం మొదటి రోజు మాత్రమే పోటీ ఇచ్చాడు..ఆ తర్వాత రెండవ రోజు నుండి ‘వాల్తేరు వీరయ్య’ కి దరిదాపుల్లో కూడా రాలేకపోయాడు బాలయ్య.
ఇప్పటి వరకు ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి 72 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇది ‘వాల్తేరు వీరయ్య’ నాలుగు రోజు వసూళ్ల కంటే తక్కువ అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు..’వాల్తేరు వీరయ్య’ కి ఇప్పటి వరకు 120 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఫుల్ రన్ లో కచ్చితంగా 150 కోట్ల రూపాయిలు కొల్లగొడుతుందనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్..అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ ని ఒక ఆట ఆడిస్తున్నారు..ఒకప్పుడు చిరంజీవి మొదటి రోజు వసూళ్ల రేంజ్ లో కూడా బాలయ్య క్లోసింగ్ షేర్ పడేది..కానీ ఈసారి బాలయ్య క్లోసింగ్ ఎగరడానికి వీకెండ్ వరకు సమయం పట్టిందంటే బాలయ్య మార్కెట్ బాగా పెరిగిందని మెగా ఫ్యాన్స్ వెటకారం చేస్తున్నారు.